సినిమా

Bigg Boss 5 Telugu: 'అందరు నా ఫ్రెండ్సే కాజల్ తప్ప..' బిగ్ బాస్ నుండి యానీ మాస్టర్ ఎలిమినేట్..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌లో సండే అంటే కేవలం ఫన్‌డే మాత్రమే కాదు.. ఎలిమినేషన్ డే కూడా.

Bigg Boss 5 Telugu (tv5news.in)
X

Bigg Boss 5 Telugu (tv5news.in)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌లో సండే అంటే కేవలం ఫన్‌డే మాత్రమే కాదు.. ఎలిమినేషన్ డే కూడా. ప్రతీ ఆదివారం బిగ్ బాస్ నుండి ఎవరో ఒకరు ప్రేక్షకులను మెప్పించలేక ఇంటిబాట పట్టాల్సిందే. అలా ఈసారి బిగ్ బాస్ హౌస్ నుండి తప్పుకున్న కంటెస్టెంట్ యానీ మాస్టర్. మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో ఒక్కసారిగా హౌస్‌మేట్స్ అందరూ కంటతడి పెట్టుకున్నారు. హౌస్ నుండి స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత యానీ మాస్టర్ అందరితో చివరిసారిగా ముచ్చటించింది.

యానీ మాస్టర్, కాజల్, ప్రియాంక.. ఈ ముగ్గురు ఈవారం డేంజర్ జోన్‌లో ఉన్నారు. పలు సర్వేల ప్రకారం ఈ ముగ్గురే ఓట్ల విషయంలో చివరి స్థానాల్లో ఉన్నారు. చివరివరకు వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియనట్టుగా ఉంది వీరి ఓట్ల శాతం. ఇక అనుకున్నట్టుగానే ఈ ముగ్గురి నుండి యానీ మాస్టర్ బిగ్ బాస్ సీజన్ 5 నుండి 11వ వారం ఎలిమినేట్ అయ్యారు.

నామినేషన్స్‌లో ఉన్నందుకు కాజల్.. తన గేమ్‌ను చాలా స్టాటర్జీతో ఆడింది. ఎక్కువ కూల్‌గా ఉంటూ.. గొవడలకు దూరంగా ఉంటూ.. ఎవరి విషయంలో జోక్యం చేసుకోకుండా తన పని తాను చేసుకుపోయింది. వేరేవాళ్లు తనతో గొడవపడుతున్న కూడా కాజల్ అక్కడి నుండి సైలెంట్‌గా వెళ్లిపోయింది. ఇలా చేయడం వల్ల కాజల్ సేఫ్ అయ్యింటుందని బిగ్ బాస్ ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ యానీ మాస్టర్ అలా కాదు.

కాజల్‌కు, తనకు మధ్య ఉన్న గొడవ రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగినా ప్రతీసారి యానీ మాస్టర్ ప్రవర్తన చాలా చిరాకుగా ఉండేది చూసిన ప్రేక్షకులకు. అది కూడా యానీ మాస్టర్ ఎలిమినేషన్‌కు ముఖ్య కారణమనే చెప్పవచ్చు. హౌస్ వదిలి వెళ్లేటప్పటికి కూడా యానీ మాస్టర్, కాజల్ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోలేదు. అందుకే స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత హౌస్‌మేట్స్ అందరి గురించి ఒక్కమాటలో చెప్పమంటే తాను అందరినీ ఫ్రెండ్స్ అనే పిలిచింది. కానీ కాజల్ గురించి మాత్రం చెప్పడానికి ఏమీ లేదని సమాధానం ఇచ్చింది.

Next Story

RELATED STORIES