సినిమా

Priyanka Singh Remuneration : 13వారాలకి ప్రియాంక ఎంత సంపాదించిందంటే?

Priyanka Singh Remuneration : కనీసం ఈసారైనా ఓ ట్రాన్స్‌జెండర్‌ ఫినాలేలో అడుగుపెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఆశలు అడియాశలు గానే మిగిలిపోయాయి.

Priyanka Singh Remuneration : 13వారాలకి  ప్రియాంక ఎంత సంపాదించిందంటే?
X

Priyanka Singh Remuneration : కనీసం ఈసారైనా ఓ ట్రాన్స్‌జెండర్‌ ఫినాలేలో అడుగుపెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఆశలు అడియాశలు గానే మిగిలిపోయాయి. 13వ వారంలో బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ప్రియాంక సింగ్ నిష్క్రమించింది. బిగ్‌బాస్‌ షో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కంటే మానస్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానన్న బాధే ఆమెలో ఎక్కువగా కనిపించింది. అయితే 13 వారాలకి గాను బిగ్‌‌‌బాస్ షోనుంచి ప్రియాంక ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం అయితే ఆమెకు వారానికి 1.75 నుంచి 2 లక్షల రూపాయల వరకు షో నిర్వాహకులు ఆమెకి చెల్లించినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ లెక్కన చూసుకుంటే ఆమె 13 వారాలకి గాను ప్రియాంక సింగ్ ఓ పాతిక లక్షల రూపాయలు వెనకేసినట్లు టాక్.. బిగ్‌‌‌బాస్ విన్నర్ కాలేకపోయిన, టాప్ 5 లో నిలవలేకపోయిన అందం, ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియాంక ఎంతోమంది మనసులను గెలచుకుందని చెప్పవచ్చు.

Next Story

RELATED STORIES