సినిమా

Bigg Boss 5 Telugu: నాగార్జున షోలో 'ఊ అంటావా.. ఊఊ అంటావా..' పాట.. హీరో రియాక్షన్..

Bigg Boss 5 Telugu: 100 రోజులకు పైగా సాగిన బిగ్ బాస్ 5 తెలుగు ప్రయాణం ముగింపుకు వచ్చేసింది.

Bigg Boss 5 Telugu: నాగార్జున షోలో ఊ అంటావా.. ఊఊ అంటావా.. పాట.. హీరో రియాక్షన్..
X

Bigg Boss 5 Telugu: 100 రోజులకు పైగా సాగిన బిగ్ బాస్ 5 తెలుగు ప్రయాణం ముగింపుకు వచ్చేసింది. 19 మంది కంటెస్టెంట్స్‌లో అన్ని అడ్డంకులను దాటుకుంటూ అయిదుగురు హౌస్‌మేట్స్ టాప్ 5కు చేరుకున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో సన్నీ, మానస్, షన్నూ, సిరి, శ్రీరామచంద్ర మాత్రమే మిగిలారు. ఓట్ల పరంగా చూసుకుంటే ఇప్పటివరకు సన్నీనే ముందంజలో ఉన్నాడు. అయితే ఈసారి బిగ్ బాస్ ఫైనల్‌కు గెస్ట్‌లుగా చాలామంది టాలీవుడ్, బాలీవుడ్ తారలు రాబోతున్నారు.

మామూలుగా బిగ్ బాస్ ఫైనల్‌లో తారలు రావడం, అలరించడం సహజమే. కానీ ఈసారి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ తెలుగు షోలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. గ్రాండ్ ఫైనల్‌కు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలయ్యింది. అయితే ముందు అనుకున్నట్టుగానే బాలీవుడ్ నటి ఆలియా భట్ కూడా బిగ్ బాస్ ఫైనల్‌ వేదికపై అలరించింది.

ఇప్పటివరకు వచ్చిన రూమర్స్ ప్రకారం రణవీర్, దీపికా జంట బిగ్ బాస్ ఫైనల్స్‌కు వస్తారేమో అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ఆ జంట ప్లేస్‌లో రణబీర్, ఆలియా జంట బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. పైగా ఆలియా తెలుగులో దబిడి దిబిడే అన్న డైలాగ్ చెప్తూ.. అందరినీ నవ్వించింది. రాజమౌళి, రష్మిక, సుకుమార్, డీఎస్‌పీ, నాని, కృతి శెట్టి, సాయి పల్లవి తదితరులు బిగ్ బాస్ స్టేజ్‌పై నాగార్జునతో కలిసి నవ్వుల పూలు పూయించారు.

బిగ్ బాస్ ఫైనల్ స్టే్జ్‌పై ఎక్స్ హౌస్‌మేట్స్ అందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో అలరించారు. వారితో పాటు సీనియర్ నటి శ్రేయ కూడా తన డ్యాన్స్‌తో మైమరిపించింది. త్వరలోనే రవితేజ 'ఖిలాడి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కానున్న డింపుల్ హయాతి.. ఇటీవల పుష్ప సినిమాలో హైలైట్ అయిన సమంత పాట 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' పాటను పర్ఫార్మ్ చేసింది. అయితే నాగార్జున్ షోలో ఈ పాటపై ఒకరు పర్ఫార్మ్ చేయడాన్ని ఆయన ఎలా ఒప్పుకున్నారో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


Next Story

RELATED STORIES