సినిమా

Bigg Boss 5 Telugu: నువ్వు వచ్చాక పెళ్లి చేసుకుందాం: బిగ్ బాస్ సిరికి ప్రేమలేఖ

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఏడవ వారం నడుస్తోంది.

Siri Hanmanth (tv5news.in)
X

Siri Hanmanth (tv5news.in)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఏడవ వారం నడుస్తోంది. ఇన్నిరోజుల నుండి అక్కడ ఉన్న హౌస్‌మేట్స్ అందరూ వారి వారి కుటుంబాలకు దూరంగా ఉన్నారు. అన్నిరోజులు కుటుంబానికి దూరంగా ఉన్న సమయంలో వారి నుండి ఒక్క లేఖ అందితే.. ఎలా ఉంటుంది..? ఫోన్‌లో మెసేజ్‌లు చేసుకుంటున్న ఈకాలంలో కూడా లేఖ రాయడం ఎంతో స్పెషల్. అలాంటిది ఇంటి నుండి చాలారోజులు దూరంగా ఉన్నవారికి అలాంటి లేఖ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి లేఖను కొందరు హౌస్‌మేట్స్ త్యాగం చేయాల్సి వచ్చిందదిబిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ అందరికీ వారి ప్రియమైన వారి నుండి లేఖలు అందాయి. కానీ అందరూ ఆ లేఖలను చదవలేరు. బిగ్ బాస్ ఇద్దరు హౌస్‌మేట్స్‌కు ఒకేసారి లేఖలను పంపిస్తాడు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే లెటర్‌ను చదవగలరు. మిగిలిన వారికి లేఖ చదివే అవకాశం లేకపోగా నామినేట్ కూడా అవుతారు. విశ్వ, సిరిలకు ఒకేసారి లెటర్ వచ్చినప్పుడు విశ్వ కోసం సిరి తన లెటర్‌ను త్యాగం చేసి నామినేట్ అయ్యింది. అది సిరి కోసం తన ప్రియుడు శ్రీహాన్ రాసిన లెటర్.


'హాయ్ సిరి.. మన ఏడేళ్ల రిలేషన్‌లో ఇన్నిరోజులు దూరంగా ఉంటామని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు నా పక్కన లేకపోయినా మన లవ్‌ను ఫీల్ అవుతున్నాను. మా అమ్మ నాన్న తర్వాత నా గురించి ఎక్కువ ఆలోచించింది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే సిరి. మనం బాగున్నప్పుడు అందరూ మనల్ని నమ్ముతారు. కానీ నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మావు సిరి. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వు వచ్చాక పెళ్లి చేసుకుని లైఫ్‌లాంగ్ కలిసుందాం' అంటూ తన ప్రేమను బయటపెట్టాడు శ్రీహాన్.

Next Story

RELATED STORIES