సినిమా

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఫైనల్‌లో మిగిలేది నలుగురే.. ఈరోజే సిరి ఔట్..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ చివరి వారానికి చేరుకుంది. మామూలుగా చివరి వారంలో అయిదుగురు కంటెస్టెంట్స్ మిగులుతారు.

siri hanmanth (tv5news.in)
X

siri hanmanth (tv5news.in)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు చివరి వారానికి చేరుకుంది. మామూలుగా చివరి వారంలో హౌస్‌లో అయిదుగురు కంటెస్టెంట్స్ మిగులుతారు. అలాగే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో శ్రీరామచంద్ర, సన్నీ, షన్నూ, సిరి, మానస్ మిగిలారు. టాప్ 5 వరకు చేరుకున్న ఈ అయిదుగురికి బయట సమానంగా ఓట్లు లభిస్తున్నాయి. కానీ ఇంతలోనే టాప్ 5 నుండి ఒకరిని ఎలిమినేట్ చేసేశాడు బిగ్ బాస్.

మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షో చివరి వారం చేరుకున్న తర్వాత ఎలిమినేషన్‌లాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్‌గా ఫైనల్ ఎపిసోడ్‌లోనే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ విన్నర్ ఎవరో అనౌన్స్ చేస్తారు. కానీ ఈసారి బిగ్ బాస్ కొంచెం డిఫరెంట్‌గా జరగనుంది. ఫైనల్‌కు ఇంకా రెండు రోజులు ఉండగానే ఒక కంటెస్టెంట్‌ను హౌస్‌కు బయటికి పంపించనున్నడు బిగ్ బాస్.

ఈరోజు(శుక్రవారం) జరగనున్న ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌మేట్స్ అందరినీ లగేజ్‌తో సహా గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత హౌస్‌లో ఉన్న అయిదుగురిలో ఎవరు ఎలిమినేట్ అయిపోవాలని అనుకుంటున్నారు అని అందరినీ అడుగుతాడు. చాలామంది సిరి పేరు చెప్పడంతో తాను ఎలిమినేట్ అయినట్టుగా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. సిరి వెళ్లిపోతుండగా షన్నూ ఎమోషనల్ అవుతాడు. అయితే ఇదంతా ప్రాంక్ అని కొందరు బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు.

Next Story

RELATED STORIES