బిగ్‎బాస్ -5 మరో క్రేజీ అప్‎డేట్.. ఆగష్టు 15న మరో..

బిగ్‎బాస్ -5 మరో క్రేజీ అప్‎డేట్.. ఆగష్టు 15న మరో..
Bigg Boss 5: బిగ్ బాస్ షో ద్వారా జనాల్లో వారి మంచి గుర్తింపు వస్తుంది. ఇక త్వరలోనే 5వ సీజన్ కూడా మొదలవబోతుంది.

బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులోకి బిగ్ బాస్ షో మొదలైన సమయంలో దీన్ని ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఊహించని విధంగా ఈ షోను సూపర్ హిట్ చేశారు. బిగ్ బాస్(bigg boss) నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే బిగ్‎బాస్‎లో వచ్చే కంటెస్టెంట్లకు వచ్చే ఫాలోయింగ్ మాములుగా ఉండదు. బిగ్ బాస్ షో ద్వారా జనాల్లో వారి మంచి గుర్తింపు వస్తుంది. ఇక త్వరలోనే 5వ సీజన్ కూడా మొదలవబోతుంది. ఇటీవలే బిగ్‌బాస్‌-5 లోగోని విడుదల చేసింది స్టార్ మా చానల్. ఇక ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్‌ నాగార్జుననే వ్యవహరించనున్నాడు. దీంతో బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడనుంది.

ఆగస్ట్‌ 15న మరో ప్రోమో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రోమో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రోమో షూటింగ్‌ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. అంతేకాదు షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌ ఎంపిక పూర్తైయిందని తెలుస్తోంది. కంటెస్టెంట్స్ అందరూ ఆగస్ట్‌ 22 నుంచి వారికి క్వారంటైన్‌కు వెళ్లనునన్నట్లు సమాచారం. అక్కడ 15 రోజుల పాటు క్వారంటైన్‌ చేసి, సెప్టెంబర్‌ 5న నేరుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపనున్నారట. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపే కంటెస్టెంట్స్ రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తి చేస్తారని తెలుస్తోంది .

అయితే ఎప్పటి మాదిరే ఈ సారి కూడా సోషల్‌ మీడియాలో కంటెస్టెంట్స్ లిస్ట్ చక్కర్లు కొడుతుంది. అందులో యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నవ్వస్వామి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యూట్యూబర్ నిఖిల్, నటి లహరి, సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ 20 మందిని సెలెక్ట్ చేసినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story