Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ నుండి విశ్వ ఇంటికి.. మరి అతడి రెమ్యునరేషన్ ఎంతంటే..

Bigg Boss 5 Telugu (tv5news.in)

Bigg Boss 5 Telugu (tv5news.in)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో తొమ్మిదో వారం ఎలిమినేషన్‌లో ఎవరూ ఊహించని హౌస్‌మేట్ ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 పదవ వారానికి చేరుకుంది. ఇక తొమ్మిదో వారం ఎలిమినేషన్‌లో ఎవరూ ఊహించని హౌస్‌మేట్ ఎలిమినేట్ అయ్యారు. తనే టాస్క్‌ల విషయంలో, అందరితో కలిసే విషయంలో చాలా చురుగ్గా ఉండే విశ్వ. విశ్వ ఎలిమినేషన్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఒకింత షాక్‌కు గురిచేసింది. ఏ రకంగా చూసుకున్నా.. విశ్వ కొందరు ఇతర హౌస్‌మేట్స్‌తో పోలిస్తే స్ట్రాంగ్ అని చాలామంది ప్రేక్షకుల అభిప్రాయం.

ఇప్పటివరకు ఎలిమినేట్ అయినవారిలో శ్వేతా వర్మ ఎలిమినేషన్ కూడా ఎవరూ ఊహించలేదు. అలాగే విశ్వను కూడా అనవసరంగా పంపించేశారంటూ తన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 5కు 19 మంది ఎంట్రీ ఇవ్వగా విశ్వతో కలిపి ఇప్పటికి తొమ్మిదిమంది ఎలిమినేట్ అయ్యారు. మేల్ కంటెస్టెంట్స్‌లో అందరికంటే స్ట్రాంగ్ అయిన విశ్వని పంపించేశాక ఇంక గేమ్ ఏం ఉంటుంది.. గేమ్‌లో ఫన్ ఏముంటుంది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

టైటిల్ విన్నర్ అవుతాడు అనుకున్న విశ్వ తొమ్మిదోవారంలోనే బయటకు వచ్చేశాడు. అయితే తన రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అనుకున్నదానికంటే విశ్వ ఎక్కువగానే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు కాబట్టే ముందుగా ఒప్పుకున్నదానికంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ను అందుకుంటాడేమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

విశ్వ వారానికి రెండు నుండి రెండున్నర లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే అతడు హౌస్‌లో తొమ్మిది వారాలు ఉన్నాడు. అంటే తొమ్మిది వారాలకు కలిపి తనకు 22 లక్షలు అందే అవకాశం ఉంది. ఇక బిగ్ బాస్‌ను వదిలి వెళుతుండగా శ్రీరామచంద్ర విన్నర్ కావాలంటూ తనను టాప్ 5లో చూడాలి అనుకుంటున్నానంటూ మనసులో మాట బయటపెట్టాడు విశ్వ.

Tags

Read MoreRead Less
Next Story