సినిమా

Jessie Remuneration : పదివారాలకి జెస్సీ రెమ్యునరేషన్ ఎంతంటే?

Bigg Boss Jessie Remuneration : బిగ్‌బాస్‌ సీజన్ ఫైవ్ లోకి ఎనమిదో కంటెస్టెంట్‌గా అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన అందరిని ఆశ్చర్యపరిచిన మోడల్ జెస్సీ ..

Jessie Remuneration : పదివారాలకి జెస్సీ రెమ్యునరేషన్ ఎంతంటే?
X

Bigg Boss Jessie Remuneration : బిగ్‌బాస్‌ సీజన్ ఫైవ్ లోకి ఎనమిదో కంటెస్టెంట్‌గా అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన అందరిని ఆశ్చర్యపరిచిన మోడల్ జెస్సీ .. అంతే అనూహ్యంగా హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. అనారోగ్య కారణంగా జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. వారం రోజులుగా సీక్రెట్‌ రూంలోనే ఉన్న జెస్సీ కోలుకుంటాడని అందరు అనుకున్నారు. కానీ అలా జరగకపోగా వర్టిగో వ్యాధి మరింత తీవ్రం అయింది.

ఈ క్రమంలో షో నుంచి తప్పుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. దీంతో నామినేషన్‌లో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాజల్‌ సేఫ్‌ అయిపొయింది. అయితే ఇప్పుడు జెస్సీ రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. జెస్సీకి వారానికి రూ. 1.5 లక్షలు పారితోషికాన్ని షో నిర్వాహకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన చూసుకుంటే మొత్తం రూ. 10 -11 లక్షల వరకు జెస్సీ అందుకున్నట్టుగా సమాచారం.

ఇక హౌజ్ నుంచి వెళ్లేముందు కంటెస్టెంట్లకు జెస్సీ ఇచ్చిన సలహాలు సూచనలు మొత్తం ఎపిసోడ్‌‌‌కి హైలెట్ గా నిలిచాయి.

Next Story

RELATED STORIES