Bigg Boss 5 Telugu: పండగకు ఇంటికి దొంగచాటుగా వెళ్లేదాన్ని: పింకీ

Bigg Boss 5 Telugu: పండగకు ఇంటికి దొంగచాటుగా వెళ్లేదాన్ని: పింకీ
Bigg Boss 5 Telugu: ట్రాన్స్‌జెండర్‌లకు సొసైటీలోనే కాదు తమరి ఇళ్లల్లో కూడా స్థానం ఉండదు.

Bigg Boss 5 Telugu: ట్రాన్స్‌జెండర్‌లకు సొసైటీలోనే కాదు వారి ఇళ్లలో కూడా స్థానం ఉండదు. కాలం ఎంత మారుతున్నా చాలామంది ఇప్పటికీ ట్రాన్స్‌జెండర్‌లను తక్కువ చేసే చూస్తారు. వారంటే సమాజంలో ఒక చిన్న చూపు ఉంటుంది. కానీ వాటన్నింటిని దాటుకొని ఏదో ఒకటి సాధించాలని ఆశించే వారు కూడా ఉంటారు. అందులో ఒకరే ప్రియాంక సింగ్. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ తనకు ఇచ్చిన సర్‌ప్రైజ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

బిగ్ బాస్ రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా ప్రతీ భాషలో అనేకమంది అభిమానులు ఉన్నారు. ఈ షో ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ అలాంటిది. ఎంటర్టైన్మెంట్‌తో పాటు గత సీజన్ నుండి బిగ్ బాస్ ఒక కొత్త ఆలోచనకు ప్రాణం పోసింది. అదే ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఒక ట్రాన్స్‌జెండర్‌ను తీసుకొని రావడం. ఒక ట్రాన్స్‌జెండర్‌ను మనలో ఒకరిగా భావించే ఆలోచన మొదలవ్వాలని బిగ్ బాస్ నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలా బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ద్వారా మనకు పరిచయమయ్యింది ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ. పింకీ వచ్చిన మొదటి రోజు నుండి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే ప్రయత్నిస్తోంది. హౌస్‌మేట్స్‌లో ఎక్కువశాతం నెగిటివిటీ లేనిది పింకీకే. అందుకే తనకు బిగ్ బాస్ ద్వారా అనేకమంది అభిమానులు కూడా అయ్యారు. చాలామంది బుల్లితెర సెలబ్రిటీలు కూడా పింకీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి పింకీ పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు చూసింది.

ట్రాన్స్‌జెండర్‌‌గా మారాలనుకున్న తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయలేదు. అయితే బిగ్ బాస్ వల్ల చాలాకాలం తర్వాత తన తండ్రి పింకీని మళ్లీ యాక్సెప్ట్ చేసారు. పింకీ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి మాట్లాడిన ఒక వీడియోను తనకు గిఫ్ట్‌గా ఇచ్చాడు బిగ్ బాస్. అది చూసిన పింకీ ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. తను పడ్డ కష్టాలను మరోసారి గుర్తుచేసుకుంది.

పండగకు ఇంటికి దొంగచాటుగా వెళ్లేదాన్నని, అలాంటిది మా నాన్న నన్ను యాక్సెప్ట్‌ చేశాడంటే నమ్మలేకపోతున్నానంది పింకీ. బిగ్ బాస్ నుండి వెళ్లగానే నాన్నను పట్టుకుని గట్టిగా ఏడవాలనుందని మనసులోని మాటను బయటపెట్టింది. హౌస్‌మేట్స్ కూడా తనతో పాటు ఎమోషనల్ అయ్యారు. అది చూసిన నెటిజన్లు బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో ఇదే బెస్ట్ ఎపిసోడ్ అని కామెంట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story