Bigg Boss Tamil 7: వనితా విజయ్ కుమార్ పై దాడి

Bigg Boss Tamil 7: వనితా విజయ్ కుమార్ పై దాడి
బిగ్ బాస్ తమిళ్ 17పై లేటెస్ట్ అప్ డేట్.. మాజీ కంటెస్టంట్ పై దాడి

నటి వనిత విజయ్‌కుమార్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. 'దేవీ' మూవీతో తెలుగు వాళ్లకు పరిచయమైన ఆమె.. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె కూతురు జోవిక బిగ్ బాస్ 7 తమిళ్ లో కంటెస్టంట్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమెపై వస్తోన్న ట్రోలింగ్ ను వనిత తిప్పి కొడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 25న తనపై దాడి జరిగిందని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ ఫొటోలను కూడా ఆమె ఇన్ స్టాలో షేర్ చేసింది.

తనపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేశారని, అతనెవరో దేవుడికి మాత్రమే తెలుసని వనిత పోస్టులో తెలిపింది. దీనికి బిగ్ బాస్ స్టార్ ప్రదీప్ ఆంటోనీ అభిమాని అని తెలుస్తోందని, అతన్ని విచారిస్తే అన్ని విషయాలూ బయటికొస్తాయని చెప్పింది. "రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ చెప్పి తాను డిన్నర్ కోసం బయటకు వచ్చాను. మా అక్క సౌమ్య ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న కారు తీయడానికి వస్తుండగా.. రాత్రి 11సమయంలో.. ఆ చీకట్లోనుంచి ఓ వ్యక్తి కనిపించాడు. నీకు రెడ్ కార్డ్ గుర్తుందా" అంటూ కొట్టాడని వనిత విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసింది. రెడ్ కార్డ్ వివాదంలో మీ సపోర్ట్ కూడా ఉందంటూ ఆ వ్యక్తి పారిపోయాడని ఆమె వెల్లడించింది.

దీంతో తన ముఖంపై రక్తం వచ్చిందని, అలా అరుస్తూ ఏడ్చానని వనిత చెప్పింది. అప్పటికి అర్థరాత్రి ఒంటిగంట అయిందన్న ఆమె.. వెంటనే తన అక్కకు ఫోన్ చేశానని, ఆమె పోలీసులకు కంప్లయింట్ చేయమని సలహా ఇచ్చిందని చెప్పింది. కానీ తాను అంతగా వారిని నమ్మనందున వారికి చెప్పలేదంది. అప్పుడు హాస్పిటల్ వెళ్లి.. ట్రీట్మెంట్ తర్వాత ఇంటికెళ్లానని తెలిపింది. తనపై ఎవరు దాడి చేశారో తెలియదని, కానీ అతను పిచ్చివాడిలా నవ్విన నవ్వును తాను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని వనిత తెలిపింది. ప్రస్తుతం తాను రెస్ట్ తీసుకుంటున్నానని, ఈ స్థితిలో తెర ముందుకు రావడం సాధ్యం కాదని ఆమె చెప్పింది.

ప్రదీప్ ఆంటోని ఏమన్నారంటే..

బిగ్ బాస్ తమిళ్ 7 కంటెస్టెంట్ సోషల్ మీడియాలోకి వెళ్లి వనితతో తన చాట్‌ను పంచుకున్నారు. కంటెస్టెంట్‌లలో తాను ఎవరికీ వ్యతిరేకంగా లేనని, మీకు ఏమి జరిగిందో నాకు తెలియదు, కానీ నేను మీ కోసం చింతిస్తున్నాను. విశ్రాంతి తీసుకోండి . జోవికా తెలివైనది, ఆమె తనంతట తానుగా గెలవగలదు, ఆమెకు మీ సహాయం అవసరం లేదని చెప్పాడు.


Tags

Read MoreRead Less
Next Story