సినిమా

Bigg Boss Telugu: రెండు నెలల్లోనే బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్..?

Bigg Boss Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో మొదలయినప్పటి నుండి ఇక్కడి ప్రేక్షకుల నుండి విశేష స్పందనను అందుకుంటుంది.

Bigg Boss Telugu: రెండు నెలల్లోనే బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్..?
X

Bigg Boss Telugu: బిగ్ బాస్ అనే రియాలిటీ షో తెలుగులో మొదలయినప్పటి నుండి ఇక్కడి ప్రేక్షకుల నుండి విశేష స్పందనను అందుకుంటోంది. అందుకే సక్సెస్‌ఫుల్‌గా అయిదు సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రతీ సీజన్‌కు ప్రేక్షకుల్లో బిగ్ బాస్ తెలుగుపై ఉన్న క్రేజ్ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. అందుకే బిగ్ బాస్ యాజమాన్యం ఓ నిర్ణయానికి వచ్చింది. బిగ్ బాస్ అభిమానులకు డబుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది.

బిగ్ బాస్ అనే రియాలిటీ షో మన దేశంలో మొదలయ్యి అక్కడ సూపర్ డూపర్ సక్సెస్‌ను అందుకుంది. అందుకే వరుసగా 13 సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే బిగ్ బాస్ అంత హిట్ అవ్వడంతో హిందీ బిగ్ బాస్ టీమ్ ఓ కొత్త ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే బిగ్ బాస్ ఓటీటీ. ఇటీవల ప్రారంభమయిన ఈ బిగ్ బాస్ ఓటీటీకి కూడా ప్రేక్షకుల దగ్గర నుండి విశేష స్పందన లభిస్తోంది.

బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రస్తుతం టీవీలో ప్రసారమవుతుంది. దాంతో పాటు ఆ ఎపిసోడ్ టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత అది ఓటీటీలోకి వస్తుంది. కానీ ఈసారి అలా కాకుండా కేవలం ఓటీటీ కోసమే ఓ బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది. అదే బిగ్ బాస్ ఓటీటీ. ఈ బిగ్ బాస్ ఓటీటీని ఏదో ఒక ఓటీటీ కొనుగోలు చేసి దానిలో మాత్రమే ప్రసారం చేస్తుంది.

ఇటీవల హిందీలో ప్రారంభమయ్యి హిట్ అయిన బిగ్ బాస్ ఓటీటీ.. తెలుగులోకి కూడా రానుందని ఇప్పటికే రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే అయిదు సీజన్లు మాత్రమే పూర్తయినా కూడా బిగ్ బాస్ తెలుగుకు చాలా క్రేజ్ రావడంతో మేకర్స్ త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు టాక్. బిగ్ బాస్ 5 తెలుగు ఫైనల్‌లో నాగార్జున వెళ్లిపోతూ త్వరలోనే కలుద్దాం అనే మాట దీనికి సంకేతమా అనే సందేహం చాలామందిలో మొదలయ్యింది.

Next Story

RELATED STORIES