సినిమా

Bigg Boss VJ Sunny: బిగ్ బాస్ ప్రేక్షకుల్లో సన్నీకే ఎక్కువ సపోర్ట్.. తానే ఈసారి విన్నరా..?

Bigg Boss VJ Sunny: ఒక జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన సన్నీ.. యాక్టర్‌గా ఎదగాలనుకున్నాడు.

VJ Sunny (tv5news.in)
X

VJ Sunny (tv5news.in)

Bigg Boss VJ Sunny: వీజే సన్నీ.. ఇప్పటివరకు బిగ్ బాస్ షోలో చాలా నామినేషన్స్‌లో నిలబడి, ప్రేక్షకుల సపోర్ట్‌తో ఎలిమినేషన్స్‌ను దాటుకుని టాప్ 5కు చేరువలో ఉన్న కంటెస్టెంట్. సన్నీని చూడగానే ప్రేక్షకులు ఇతడికి కోపం ఎక్కువ అనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ప్రతీసారి ఆ కోపం వెనుక ఓ బలమైన కారణం ఉన్నట్టు కొన్నిరోజులకు వారే గుర్తించారు. ఫ్రెండ్స్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవడం, తాను నమ్మిన మాటపైనే ధృడంగా నిలబడడం.. ఇవన్నీ సన్నీని ప్రేక్షకులకు దగ్గర చేశాయి. అంతే కాకుండా తనకు ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యేలా చేశాయి. అందుకే మిగతా హౌస్‌మేట్స్‌కంటే సన్నీకే ఎక్కువ సపోర్ట్ లభిస్తోంది.బిగ్ బాస్.. ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు ఇష్టపడే ఓ రియాలిటీ షో. ఈ షో తెలుగులో ప్రారంభమయినప్పటి నుండి ప్రతీ సీజన్‌కు దీని క్రేజ్ కూడా పెరుగుతూ వస్తోంది. సోషల్ మీడియా కూడా దీనికి ఓ కారణం. సోషల్ మీడియా చూస్తే చాలు.. బిగ్ బాస్ టైటిల్ ఎవరికి దక్కుతుందో ఈజీగా చెప్పేయవచ్చు అనే పరిస్థితి ఏర్పడింది. ఈసారి సోషల్ మీడియా స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే.. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు విన్నర్ సన్నీ అని తెలుస్తుంది.చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులకు షన్నూ గెలుస్తాడా, సన్నీ గెలుస్తాడా అన్న సందేహం ఉంది. షన్నూకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అన్న అభిప్రాయం ఉంది. కానీ దీని వెనుక షన్నూకు బలమైన సోషల్ నెట్‌వర్క్ ఉంది. దాని వల్లే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అవుతోంది అన్న అనుమానాలు లేకపోలేదు. షన్నూతో పోలిస్తే సన్నీకి సోషల్ మీడియాలో రియల్ ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ ప్రేక్షకుల్లో వేరీ బిగ్ ఫాలోవర్స్ ఉన్నారు. అన్నింటికి మించి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఫ్యామిలీ వ్యూయర్స్‌కు కూడా షో చూస్తున్నంతసేపు సన్నీనే సపోర్ట్ చేస్తున్నారని టాక్. అందుకే ఇంట, బయట సన్నీకి మద్దతు బాగా పెరుగుతోంది.


ఒక జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన సన్నీ.. యాక్టర్‌గా ఎదగాలనుకున్నాడు. దానికోసం ఎంతో కృషి చేశాడు కూడా. అయినా సన్నీ కెరీర్ సాఫీగా సాగలేదు. జర్నలిస్ట్ నుండి యాంకర్‌గా మారాడు. యాక్టర్ అవ్వాలనుకున్న సన్నీ పరిస్థితులు అనుకూలించక యాంకర్ దగ్గరే ఆగిపోయాడు. ఓ మ్యూజిక్ ఛానెల్‌లో చాలాకాలం యాంకర్‌గా పనిచేశాడు. దాంతో పాటు పట్టు వదలకుండా ఆడిషన్స్‌కు వెళ్తూనే ఉన్నాడు కూడా. అలా ఒక ఆడిషన్‌లో సన్నీ పర్ఫార్మెన్స్ నచ్చి తనకు సీరియల్ హీరోగా ఛాన్స్ ఇచ్చింది ఓ పెద్ద నిర్మాణ సంస్థ. అంతే బుల్లితెర యాక్టర్‌గా తన కల కొంతవరకు నెరవేరింది.సీరియల్‌ హీరోగా కెరీర్ ప్రారంభించిన సన్నీకి గ్రాండ్ వెల్‌కమ్ దొరికింది. బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా అవార్డు కూడా అందుకున్నాడు. ఒక్క సీరియల్ ద్వారా పలు సీరియల్స్‌లో నటించే ఛాన్స్ కూడా దక్కించుకున్నాడు. అదే సమయంలో బిగ్ బాస్ అవకాశం సన్నీ తలుపు తట్టింది. కాదనకుండా దానిని యాక్సెప్ట్ చేశాడు. ఇతర కంటెస్టెంట్స్‌లాగానే సన్నీ కూడా పెద్దగా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. కానీ అడుగుపెట్టిన తర్వాత ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆ అభిమానుల అండదండలు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇన్నర్ సపోర్ట్‌తో సన్నీ టైటిల్ గెలుస్తాడు అన్న నమ్మకం ప్రేక్షకుల్లో పెరుగుతోంది.Next Story

RELATED STORIES