Bollywood : మాధురీ దీక్షిత్ కు మాతృవియోగం

Bollywood : మాధురీ దీక్షిత్ కు మాతృవియోగం
మాధురి దీక్షిత్ తల్లి స్నేహలత (91) ఆదివారం కన్నుమూశారు. ఆవిడ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు వర్లీ శ్మశానవాటికలో జరుగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు


బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఇంట విషాదం నెలకొంది. మాధురి తల్లి స్నేహలత (91) ఆదివారం కన్నుమూశారు. ఆవిడ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు వర్లీ శ్మశానవాటికలో జరుగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాధురీ దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్, ఈ విషాద వార్తను మీడియాతో పంచుకున్నారు. ఇందుకుగాను ప్రకటన విడుదల చేశారు "మా ప్రియమైన ఆయి, స్నేహలతా దీక్షిత్, ఆమె ప్రియమైన వారు చుట్టూ ఉండగా ఈ ఉదయం ప్రశాంతంగా కన్నుమూశారు" అని ప్రకటించారు.

గత సంవత్సరం మాధురీ దీక్షిత్ తన తల్లి 90వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫొటోను పంచుకున్నారు. అందులో... "హ్యాపీ బర్త్ డే ఆయి.. ఏ తల్లి అయితే కూతురి యొక్క బెస్ట్ ఫ్రెండో ఆ కూతురికి ఈ ప్రపంచలో ఏం కావాలి. మీరు నేర్పిన పాఠాలు, మీ నుంచి నాకు లభించిన అతిపెద్ద బహుమతి. మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు. మాధురీ దీక్షిత్ తల్లికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story