RRR Movie: 'ఆర్ఆర్ఆర్ లాంటి చెత్త సినిమాను తీసినందుకు రాజమౌళిని జైలులో పెట్టాలి': బాలీవుడ్ హీరో

RRR Movie: ఆర్ఆర్ఆర్ లాంటి చెత్త సినిమాను తీసినందుకు రాజమౌళిని జైలులో పెట్టాలి: బాలీవుడ్ హీరో
RRR Movie: ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ కాస్త ఎక్కువయింది అన్నాడు కమల్ ఖాన్.

RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ప్రేక్షకులతో సహా సెలబ్రిటీలు కూడా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సినిమా బెనిఫిట్ షో చూసేసి వారు రివ్యూలను ట్విటర్‌లో పెట్టేశారు. బాహుబలి తరహాలోనే గ్రాండియర్‌గా ఆర్ఆర్ఆర్‌ను ప్రేక్షకులకు నచ్చేలా రాజమౌళి తెరకెక్కించాడు అంటూ అందరూ తనను ప్రశంసిస్తున్నారు. కానీ ఒక్కరు మాత్రం వీటన్నింటికి భిన్నంగా మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్‌కు పూర్తి నెగిటివ్ రివ్యూ ఇచ్చే పనిలో పడ్డాడు.

ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లు తమ యాక్టింగ్‌కు ఆర్ఆర్ఆర్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లారని అభిమానులు భావిస్తుండగా.. బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్‌కు మాత్రం సినిమా వేరేలాగా అర్థమయినట్టుంది. 'ఆర్ఆర్ఆర్ పూర్తిగా తల, తోక లేని ఓ సౌత్ మసాలా సినిమా' అని ట్వీట్ చేశాడు కమల్ ఖాన్. దీంతో ఆగకుండా వరుసగా ఆర్ఆర్ఆర్‌పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. వరుసగా ట్వీట్లు చేశాడు. సినిమాను మాత్రమే కాకుండా రాజమౌళిని కూడా విమర్శించాడు కమల్.

ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ కాస్త ఎక్కువయింది అన్నాడు కమల్ ఖాన్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుందని, రాజమౌళి ఆ లిమిట్ దాటేశాడని అన్నాడు. ఈ సినిమా చూడడం వల్ల తన సెన్సెస్ అన్నీ కోల్పోయాడని, ప్రస్తుతం తనకు జ్ఞానం శూన్యం అయిపోయింది అని తెలిపాడు. అలా ఎలా చేయగలిగారని రాజమౌళిని ప్రశ్నించాడు కమల్ ఖాన్.

'ఇండియన్ సినియా హిస్టరీలో ఎప్పుడూ చేయనంత పిచ్చి సినిమా ఆర్ఆర్ఆర్. ఇది మనిషి మెదడులోని సెల్స్‌ను నాశనం చేసి బ్రతికుండగానే చంపేస్తుంది. ఇండియాలో తెరకెక్కిన వాటిలో ఇదొక చెత్త సినిమా. దీంతో పోలిస్తే థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చాలా బెటర్. దీనికి నేను జీరో రేటింగ్ ఇస్తాను' అని ఓ ట్వీట్‌లో ఆర్ఆర్ఆర్ గురించి పూర్తిగా నెగిటివ్‌గా మాట్లాడిన కమల్ ఖాన్.. మరొక ట్వీట్‌లో రాజమౌళిని కించపరిచేలా వ్యాఖ్యానించాడు.

'దీనిని నేను పొరపాటు అనను. ఇది ఒక పెద్ద క్రైమ్. 600 కోట్లతో ఆర్ఆర్ఆర్ లాంటి చెత్త సినిమాను తెరకెక్కించినందుకు రాజమౌళిని కనీసం 6 నెలలు జైలులో పెట్టాలి' అంటూ కమల్ ఖాన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు.. కమల్‌కు పిచ్చి పట్టిందా అంటూ విమర్శలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story