సినిమా

Shilpa Shetty _ Raj Kundra : జైలు నుంచి విడుదలయ్యాక మొదటిసారి.. భార్యతో కలిసి..!

Shilpa Shetty _ Raj Kundra : సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలైన తర్వాత ప్రముఖ బిజినెస్ మెన్, బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు.

Shilpa Shetty _ Raj Kundra : జైలు నుంచి విడుదలయ్యాక మొదటిసారి.. భార్యతో కలిసి..!
X

Shilpa Shetty _ Raj Kundra : సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలైన తర్వాత ప్రముఖ బిజినెస్ మెన్, బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. భార్యాభర్తలిద్దరూ ఆధ్యాత్మిక చింతన కోసం హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ ఆలయాన్ని సందర్శించినట్లుగా తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరు మ్యాచింగ్ యెల్లో ఔట్‌ఫిట్‌లో ఒకరి చేతుల్లో ఒకరు చేయి వేసుకుని గుడి ప్రాంగణంలో కనువిందు చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక రాజ్‌కుంద్రా ఇలా పబ్లిక్ గా కనిపించడం ఇదే మొదటిసారి.

కాగా రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో జులైలో అరెస్ట్ కాగా సెప్టెంబర్ లో బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో ముంబై కోర్టు రూ. 50,000 పూచీకత్తుపై సెప్టెంబర్ 20న కుంద్రాకు బెయిల్ మంజూరు చేసింది. గత వారం, రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతాలను తొలగించాడు.Next Story

RELATED STORIES