సినిమా

Vicky Kaushal: విక్కీ కౌశల్ సినిమాపై కేసు.. రంగంలోకి దిగిన పోలీసులు.. కట్ చేస్తే సీన్ రివర్స్..

Vicky Kaushal: సినిమాలు తెరకెక్కిస్తున్న సమయంలో మూవీ యూనిట్ చేసే పొరపాట్లు ఒక్కొక్కసారి పెద్ద పరిణామాలకే దారితీస్తాయి.

Vicky Kaushal: విక్కీ కౌశల్ సినిమాపై కేసు.. రంగంలోకి దిగిన పోలీసులు.. కట్ చేస్తే సీన్ రివర్స్..
X

Vicky Kaushal: సినిమాలు తెరకెక్కిస్తున్న సమయంలో మూవీ యూనిట్ చేసే పొరపాట్లు ఒక్కొక్కసారి పెద్ద పరిణామాలకే దారితీస్తాయి. ప్రేక్షకులు అన్ని విషయాలను గమనించరేమో అని పొరబడి మూవీ యూనిట్ కొన్ని విషయాలను ఈజీగా తీసుకుంటుంది. అలా జరగడం వల్లే బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న సినిమాపై కేసు నమోదయ్యింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ కలిసి ఓ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం ఇండోర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం మూవీ యూనిట్ అంతా ఔట్‌డోర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ బైక్‌పై వెళ్తున్న సన్నివేశానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యి కాసేపట్లోనే వైరల్‌గా మారింది.

ఆ సీన్‌లో కనిపిస్తున్న బైక్‌పై తన నెంబర్ ప్లేట్ ఉండడంతో ఇండోర్‌కు చెందిన జై సింగ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది తన నెంబర్ ప్లేట్ అని, అనుమతి లేకుండా అలా ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేపట్టిన తర్వాత.. ఈ ఇద్దరి నెంబర్ ప్లేట్స్ వేర్వేరు అని తెలుసుకున్నారు. ఫోటోల్లో బోల్ట్ అడ్డం రావడంతో ఒక నెంబర్ తప్పుగా కనిపించిందని వారు స్పష్టం చేశారు.

Next Story

RELATED STORIES