సినిమా

MAA Elections 2021: చిరు లాస్ట్ పంచ్.. వాళ్లకు వాత పెట్టి వెన్న రాసి..

MAA Elections 2021: మా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

MAA Elections 2021: చిరు లాస్ట్ పంచ్.. వాళ్లకు వాత పెట్టి వెన్న రాసి..
X

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి, ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌, మిగిలిన విజేతలందరికి అభినందనలు తెలియజేసారు. ఈ కొత్త కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. మా ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబమని, ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టేనన్నారు. ఆ స్పూర్తితోనే ముందుగు సాగుతామని నమ్ముతున్నట్లు తెలిపారు.

అంతకుముందు ఓ ఈవెంట్‌లో మా ఎన్నికలపై స్పందించారు మెగాస్టార్‌ చిరంజీవి. ఏదైనా తాత్కాలికమేనని, రెండు, మూడేళ్లు ఉండే పదవులనేవి చిన్న చిన్న బాధ్యతల్లాంటివన్నారు. వాటి కోసం మనం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే.. బయటివారికి లోకువైపోతామన్నారు. తాను ఏ ఒక్కరిని వేలు పెట్టి చూపించడం లేదని, అయితే.. మన ఆధిపత్యం చూపించుకునేందుకు ఎదుటివారిని కించపరచాల్సిన అవసరం లేదన్నారు..

మరోవైపు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నాగబాబు. మంచు విష్ణు గెలిచిన కొద్దిసేపటికే నాగబాబు ఈ నిర్ణయం తీసుకుని అందరికి షాకిచ్చారు. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో.. మా కొట్టుమిట్టాడుతోందని, ఇలాంటి అసోసియేషన్‌లో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామాను మా కార్యాలయానికి పంపుతామన్నారు. ఎంతగానో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇక మా అధ్యక్ష, కమిటీ సభ్యులకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అభినందనలు తెలిపారు. మాకు ప్రభుత్వ పరంగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.

మా అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణుతో సహా ఇరు ప్యానెళ్లలోని విజేతలందరికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మా ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారన్నారు. మా ఓటర్లు స్పూర్తిదాకమైన తీర్పు ఇచ్చారన్నారు.

మొత్తానికి మా ఎన్నికల్లో విష్ణు అనూహ్య విజయంతో మెగా కాంపౌండ్‌లో స్థబ్ధత ఏర్పడగా మంచు కాంపౌండ్‌లో మాత్రం ఫుల్‌ జోష్‌ నెలకొంది.

Next Story

RELATED STORIES