సినిమా

chetana : మా అమ్మే మళ్లీ పుట్టింది అని సంతోసిస్తా... !

సినీ నటుడు ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న ఆమె తన భర్తతో కలిసి మెటర్నటీ షూట్‌ చేయించుకుంది.

chetana :  మా అమ్మే మళ్లీ పుట్టింది అని సంతోసిస్తా... !
X

సినీ నటుడు ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న ఆమె తన భర్తతో కలిసి మెటర్నటీ షూట్‌ చేయించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కూతురు పుడితే మళ్ళీ మా అమ్మే పుట్టిందని సంతోషిస్తానని, కొడుకు పుట్టిన ఆనందమే అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలావుండగా ఇటీవలె ఉత్తేజ్‌ సతీమణి పద్మావతి క్యాన్సర్ తో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఇక చేతన విషయానికి వస్తే.. 2017లో వచ్చిన పిచ్చిగా నచ్చావ్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది.


Next Story

RELATED STORIES