Chhavi Mittal: క్యాన్సర్ బారిన పడిన బుల్లితెర నటి.. ఎమోషనల్ పోస్టులు షేర్..

Chhavi Mittal: క్యాన్సర్ బారిన పడిన బుల్లితెర నటి.. ఎమోషనల్ పోస్టులు షేర్..
Chhavi Mittal: ఆ ఆత్మస్థైర్యానికి నిదర్శనగా నిలుస్తూ.. ఓ బుల్లితెర నటి క్యాన్సర్‌తో పోరాడుతోంది.

Chhavi Mittal: క్యాన్సర్ అనేది ఎంతోమంది జీవితాలను బలిదీసుకుంది. దీనిని క్యూర్ చేయడానికి ఎన్ని మందులు వచ్చినా.. డాక్టర్లు మాత్రం క్యాన్సర్ క్యూర్ అవ్వడానికి ఆత్మస్థైర్యమే ముఖ్యం అని చెప్తుంటారు. అయితే ఆ ఆత్మస్థైర్యానికి నిదర్శనగా నిలుస్తూ.. ఓ బుల్లితెర నటి క్యాన్సర్‌తో పోరాడుతోంది. అంతే కాకుండా ఈ విషయం గురించి తను సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కూడా ఫాలోవర్స్‌ను ఎమోషనల్‌గా ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి.

ఛవి మిట్టల్.. పలు హిందీ సీరియళ్లలో నటించి పాపులారిటీ సంపాదించున్న నటి. ఒకవైపు సీరియల్స్‌తో బిజీగా ఉంటూనే ఒకట్రెండు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది ఛవి. ఇటీవల ఛవికి బ్రెస్ట్‌ క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. అయితే ఈ విషయం తెలిసినప్పటి నుండి కృంగిపోకుండా. తనలాగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి ధైర్యం చెప్పడానికి ఇన్‌స్టాగ్రామ్‌నే ఒక వేదిక చేసింది.

'రోజూ ధైర్యంగా కనిపించడం అంత సులువైన విషయం కాదు. ఈరోజు నేను బలహీనంగా ఉండడానికే అనుమతిస్తాను. నాకు కావాల్సినంత ఏడుస్తాను. కానీ రేపు నేను ఇలా ఉండను. నేను ఇది జయించడానికి పాజిటివిటీ ఒక్కటే మార్గం.' అని పోస్ట్ చేసింది ఛవి. ఇది మాత్రమే కాదు.. తన బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి వరుసగా పోస్టులు పెడుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది ఛవి.


Tags

Read MoreRead Less
Next Story