ఏంటా స్టెప్పులు.. చిరు డ్యాన్స్‎ చూసి మేనేజర్ కామెంట్స్..

ఏంటా స్టెప్పులు.. చిరు డ్యాన్స్‎ చూసి మేనేజర్ కామెంట్స్..
Chiranjeevi: ఓ సాంగ్ లో తనదైన స్టైల్‌లో చిరు స్టెప్పులేశారు. ఆ డ్యాన్సుని చూసి, అక్కడున్న వారంతా అభినందిస్తే..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దాయిదాయి దామ్మ అంటూ వీణ స్టెప్ వేసినా.. బ్రేక్ డ్యాన్స్ చేసినా అభిమానులు ఊగిపోతారు. చిరు బ్రేక్ డ్యాన్స్ చేస్తే ఇండ్రస్ట్రీ షేక్ అవ్వాల్సిందే. ఆయన కాలు కదిపితే విజిల్స్, కేరింతలతో థియేటర్స్ మోతమోగిపోవాల్సిందే. బీట్‌ ఏదైనా తనదైన మార్క్‌ చూపించి సినీ అభిమానుల్ని ఉర్రూతలూగింస్తారు. ప్రతి సినిమాలో ఆయన పరిచయం చేసే కొత్త స్టెప్స్ కోసం అభిమానులే కాదు, ఇండస్ట్రీలోని వారు సైతం ఎదురుచూస్తారు చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. చిరంజీవి డ్యాన్సుని ఓ వక్తి విమర్శించారు. చిరంజీవి డ్యాన్స్ విమర్శించడమా? ఎవరా వ్యక్తి ? ఎందుకలా అన్నారు? తెలుసుకోవాలని ఉందా..

చిరంజీవి సినీ కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లలో.. ఆయన హీరోగా నటించిన 6వ సినిమా( మాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సినిమా పేరు 'మొగుడు కావాలి') షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాలోని ఓ సాంగ్ లో తనదైన స్టైల్‌లో స్టెప్పులేశారు చిరు. ఆ డ్యాన్సుని చూసి, అక్కడున్న వారంతా అభినందిస్తే.. అదే సమయంలో ఆ చిత్రానికి మేనేజరుగా పనిచేసిన వెంకన్నబాబు చిరంజీవిని తదేకంగా చూస్తూ ఉన్నారు. దాంతో చిరంజీవి, మేనేజరు దగ్గరకు వెళ్లి డ్యాన్స్ 'ఎలా ఉంది?' అని అడగ్గా.. 'ఆ.. ఏముంది? మీ వెనక ఉన్న డ్యాన్సర్లు ఏం చేశారో, మీరు అదే చేశారు. మీకంటూ ఓ ప్రత్యేకత లేకపోతే ఎందుకట?' అని సమాధానం ఇచ్చారాయన.

వెంకన్నబాబు మాట చిరంజీవి ఆలోచనా విధానాన్ని మార్చేసింది. డ్యాన్సు మాస్టర్లు చెప్పినట్లు స్టెప్పులు వేయడమే కాదు, అదనంగా ఇంకేదో చెయ్యాలని ఆ క్షణమే అనిపించింది. అప్పుడే పాటని ఆస్వాదిస్తూ డ్యాన్స్‌ చేయడం అలవాటు చేసుకొన్నా' అని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు చిరంజీవి. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారుు. ఇటీవలే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్, ఓ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story