Chiranjeevi: మెగాస్టార్ సరసన యంగ్ బ్యూటీ.. క్రేజీ కాంబినేషన్‌‌పై రూమర్స్..

Chiranjeevi: మెగాస్టార్ సరసన యంగ్ బ్యూటీ.. క్రేజీ కాంబినేషన్‌‌పై రూమర్స్..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వెంటవెంటనే సినిమాలు ఓకే చేస్తున్న అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వెంటవెంటనే సినిమాలు ఓకే చేస్తున్న అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు చిత్రాల రెగ్యులర్ షూటింగ్‌ను కూడా అప్పుడే ప్రారంభించేశారు కూడా. అంతే కాకుండా ఇంకా మరిన్ని కథలు వింటూ ఓకే చేసే పనిలో పడ్డారు. తాజాగా ఆయన ఒక యంగ్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చారని.. అందులో మరో యంగ్ బ్యూటీ ఆయనతో జతకట్టనుందన్న వార్త వైరల్‌గా మారింది.

ఛలో, భీష్మ లాంటి యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్లతో డీసెంట్ హిట్లను అందుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల. ఈ డైరెక్టర్ ఖాతాలో హిట్లు ఉన్నా డేట్లు ఇవ్వడానికి మాత్రం హీరోలు ఖాళీగా లేరు. ఈ దర్శకుడు తన తరువాతి సినిమా ఎలాగైనా ఒక మెగా హీరోతో చేయాలన్న ఉద్దేశ్యంతో ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. కానీ మెగా హీరోల్లో ఎవ్వరి కాల్ షీట్లు ప్రస్తుతం ఖాళీగా లేవు.

ముందుగా వెంకీ కుడుముల.. వరుణ్ తేజ్‌తో కలిసి సినిమా చేయనున్నాడన్న టాక్ వినిపించింది. కానీ తర్వాత దీని గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్‌గా మారిన వెంకీ.. ఛాన్సులు లేక మళ్లీ కొన్నాళ్లు అసిస్టెంట్‌గా కూడా మారాడు. తాజాగా వెంకీ చెప్పిన కథను మెగాస్టార్ ఓకే చేసినట్టు సమాచారం. అంతే కాకుండా ఇందులో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీని ఓకే చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది.

వెంకీ కుడుముల దర్శకుడిగా చేసిన రెండు సినిమాల్లో రష్మిక మందనానే హీరోయిన్. తాను డైరెక్ట్ చేసిన 'ఛలో' సినిమాతోనే రష్మిక.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. రష్మికను తన లక్కీ ఛార్మ్‌గా అనుకుంటున్న వెంకీ.. తన తరువాతి సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయాడు.

అయితే వెంకీ తరువాతి చిత్రం చిరంజీవితో అయితే.. అందులో రష్మికనే హీరోయిన్‌గా నటిస్తుందేమో అన్న టాక్ సోషల్ మీడియాలో మొదలయిపోయింది. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోతుందని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story