సినిమా

Chiranjeevi: సంక్రాంతికి ఫ్యాన్స్ కోసం సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మెగాస్టార్..

Chiranjeevi: 2022 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా విడుదలలు ఏమీ జరగట్లేదు.

Chiranjeevi (tv5news.in)
X

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi: 2022 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా విడుదలలు ఏమీ జరగట్లేదు. ఈ విషయం ఫ్యాన్స్‌ను ఇప్పటకే డిసప్పాయింట్ చేసింది. ఒకటేసారి ముగ్గురు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలోకి దిగుతారు అనుకుంటే ఒక్కొక్కరిగా అందరూ తప్పుకున్నారు. దీంతో చిన్న సినిమాలన్నీ ఒకేసారి సంక్రాంతి విడుదలకు సిద్ధమయ్యాయి. వాటితో పాటు నాగార్జున, నాగచైతన్య మల్టీ స్టారర్ 'బంగార్రాజు' కూడా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.

సంక్రాంతికి సినిమా విడుదలలు వాయిదా పడడంతో ప్రతీ ఒక్క సినిమా ఏదో ఒక్క అప్డేట్‌తో ప్రేక్షకులను ఖుషీ చేస్తుందేమో అని వారు ఆశిస్తున్నారు. అయినా కూడా గ్యారంటీ లేదు. దాదాపు అరడజను పైగా చిన్న సినిమాలతో, బంగార్రాజు బాక్సాఫీస్ బరిలో దిగుతుండడంతో పెద్దగా పోటీ లేకుండానే ఈ సినిమా అశించినవాటికంటే ఎక్కువ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

ఒక సీనియర్ హీరో నాగార్జున.. తన సినిమాతో సంక్రాంతికి సందడిని మొదలుపెడితే.. మరో సీనియర్ హీరో చిరంజీవి సంక్రాంతికి తన ఫ్యాన్స్‌ను మరో విధంగా సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసీఫర్' చిత్రాన్ని మెగాస్టార్.. 'గాడ్ ఫాదర్' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

గాడ్ ఫాదర్ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించుకుంది. పలు యాక్షన్ సన్నివేశాలు కూడా పూర్తయినట్టు దర్శకుడు మోహన్ రాజా ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట మూవీ టీమ్. మెగాస్టార్ ఫ్యాన్స్‌కు ఈ గ్లింప్స్‌తో సంక్రాంతి లోటు తీరిపోయినట్టుగా అనుకుంటున్నారు ప్రేక్షకులు.

Next Story

RELATED STORIES