Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ

Chiranjeevi  : మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ

మెగాస్టార్ చిరంజీవి మోకాలికి సర్జరీ జరిగింది. ఆయన నటించిన తాజా చిత్రం భోళా శంకర్ రిలీజైన తర్వాత ఢిల్లీకి చెకబ్ కోసమని వెళ్లారు. డాక్టర్లు పరిస్థితిని సమీక్షించి మోకాలికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో శస్త్ర చికిత్స చేశారు. మరో వారం రోజుల పాటు మెగాస్టార్ ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుని వచ్చేవారం హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. గతంలో భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడిన ఆయన.. ఇప్పుడు మోకాలు సమస్యతో బాధపడుతుండటంతో మోగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల తర్వాతే మెగాస్టార్ మళ్లీ సినిమాల గురించి ఆలోచించనున్నట్లు సమాచారం. ఆయన అభిమానులు మాత్రం రిమేక్ చిత్రాలను చేయవద్దని చిరును కోరుతున్నారు. ఇప్పటికే భోళా శంకర్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో ఓ ట్రెండ్ ను సెట్ చేసే చిరంజీవి ఇప్పుడు తన సినిమాను హిట్ చేయడానికి చిన్న నటులమీద ఆధారపడాల్సి వస్తుందని అనుకుంటున్నారు. చిరు తన ఇమేజ్ ను మరిచాడా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒంటిచేత్తో సినిమాను మోయగల సత్తాఉన్న చిరుకు.. మరొక్క సారి కథపై దృష్టి పెడితే మంచి సినిమాను బయటకు తీసుకురాగటడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చిరుకు ఉన్న డ్యాన్స్, యాక్టింగ్, కామెడీ టైమింగ్ మరే పెద్ద హీరోకు లేవని అలాంటి చిరంజీవి రిమేక్ చిత్రాలను ఎందుకు తీస్తున్నాడని చిత్ర ప్రేమికులు అనుకుంటున్నారు. ప్రస్తుతం మోకాలికి ఆపరేషన్ జరగడంతో రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోనున్నట్లు సమాచారం. ఆతర్వాత మరో మెగా ప్రాజెక్ట్ కు చిరు పచ్చాజెండా ఉపనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story