సినిమా

Chiranjeevi : టికెట్ల ధర విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి : చిరంజీవి ట్వీట్‌

Chiranjeevi : సినిమా టికెట్ల ధర విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలంటూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌చేశారు.

Chiranjeevi : టికెట్ల ధర విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి : చిరంజీవి ట్వీట్‌
X

Chiranjeevi : సినిమా టికెట్ల ధర విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలంటూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌చేశారు. దేశమంతా ఒకటే జీఎస్టీ ఉన్నప్పుడు.. టికెట్ల ధరలూ అలాగే ఉంటే బాగుంటుందని అన్నారు. తగ్గించిన టికెట్ల రేట్లు కాలనుగుణంగా మిగతా స్టేట్స్‌లో ఉన్నట్టే నిర్ణయిస్తేనే పరిశ్రమకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పారదర్శకత కోసం ఆన్‌లైన్ విధానం తీసుకురావడం హర్షించదగిన విషయం అంటూనే.. టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు కల్పించాలంటూ కోరారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటేనే సినీ పరిశ్రమ నిలదొక్కుకుంటుందని, ధియేటర్ల మనుగడ కోసం.. సినిమాపై ఆధారపడ్డ కుటుంబాల కోసం.. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు.
Next Story

RELATED STORIES