సినిమా

Chiranjeevi: ప్రభుత్వానికి ఇదే నా విన్నపం: చిరంజీవి

Chiranjeevi: తిరుపతిలో వరదలను చూస్తుంటే ఎక్కడో ఉన్నవారికి కూడా భయమేస్తోంది.

Chiranjeevi (tv5news.in)
X

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi: తిరుపతిలో వరదలను చూస్తుంటే ఎక్కడో ఉన్నవారికి కూడా భయమేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో అన్న కంగారు కలుగుతోంది. తొందరగా ఆ వరదలు తగ్గిపోయి, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని దేశమంతా కోరుకుంటోంది. గడిచిన పాతికేళ్లలో ఇలాంటి వరద భీభత్సం ఎప్పుడు కలగలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు.

వరదల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ.. చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి సామాజిక సమస్యల గురించి ఆ మధ్య ఎక్కువగా తమ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అలాగే ఏపీలో వరద భీభత్సం గురించి కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని బయటపెట్టారు. అక్కడి ప్రజలను సురక్షితంగా ఉంచే బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.


Next Story

RELATED STORIES