Chiranjeevi: వారు సంతోషంగా ఉండేలా మనమే చూసుకోవాలి: చిరంజీవి

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi: రైతులు మనకు ఎంతో సేవ చేస్తారు. ఆ సేవను కళ్లను కట్టినట్టు చూపించడానికే ఎన్నో సినిమాలు తెరకెక్కాయి.

Chiranjeevi: జై జవాన్.. జై కిసాన్.. ఈ ఇద్దరు లేకపోతే భారతదేశం లేదు అంటుంటాం. అందుకే వారి గొప్పతనాన్ని జరుపుకోవడానికి కూడా ఓ రోజును కేటాయించాం. అదే డిసెంబర్ 23. భారతీ మాజీ ప్రధాన మంత్రి చౌదరీ చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతీ ఏడాది డిసెంబర్ 23న 'నేషనల్ ఫార్మర్స్ డే‌'ను జరపుకోవడం మొదలుపెట్టాం.

రైతులు మనకు ఎంతో సేవ చేస్తారు. ఆ సేవను కళ్లను కట్టినట్టు చూపించడానికే ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అందుకే చాలామంది సినీ సెలబ్రిటీలు నేషనల్ ఫార్మర్స్ డే సందర్భంగా రైతుల గురించి తమ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. చాలావరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సందర్భంగా మంచి మెసేజ్‌తో తన సోషల్ మీడియా ఫ్యాన్స్ ముందుకు వచ్చారు.

నేషనల్ ఫార్మర్స్ డే సందర్భంగా చిరంజీవి తన ఇన్‌‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆయన పెరట్లో పెరిగిన ఆనపకాయను చూపిస్తూ మురిసిపోయారు. 'పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే.. మట్టి నుండి పంట పండించి మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి. అలా ఉండేలా మనమే చూసుకోవాలి' అని వీడియోను పోస్ట్ చేశారు. అంతే కాకుండా రైతులకు ఈ సందర్భంగా సెల్యూట్ కూడా చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story