Cicada First Look Poster: కొత్త కాన్సెప్ట్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Cicada First Look Poster: కొత్త కాన్సెప్ట్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
'సికాడా' ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన దర్శకుడు చందూ మొండేటి, యంగ్ హీరో సోహెల్

టాలీవుడ్ లో ఓ వైపు పాన్ ఇండియా మూవీస్ అదరగొడుతుండగా.. మరో పక్క బేబీ, సామజవరగమన లాంటి చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఈ క్రమంలోనే అందరినీ ఓ కొత్త కాన్సెప్ట్‌తో పలకరించేందుకు ‘సికాడా’ అనే చిత్రం రాబోతోంది. ఒకే టైటిల్, ఒకే కథ, 4 విభిన్న భాషలు, 24 విభిన్న ట్యూన్స్‌తో రాబోతోన్న ఈ మూవీ విడుదలకు ముందు సంచలనాలు సృష్టించేలా కనిపిస్తోంది.

‘సికాడా’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి, యంగ్ హీరో సోహెల్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, నటీనటుల లుక్స్, గెటప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సికాడా యూనిట్‌లో అంతా కూడా కొత్త వారే. శ్రీజిత్ ఎడవనా దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. తీర్నా ఫిల్మ్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వందనా మీనన్, గోపకుమార్ పి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిత్ సిఆర్, గాయత్రి మయూర, జైస్ జోస్ ప్రధాన పాత్రలు పోషించారు.


ఈ సినిమా షూటింగ్ బెంగుళూరు, అట్టపాడి, వాగమోన్, కొచ్చి తదితర ప్రాంతాల్లో జరిగింది. ఇదిలా ఉండగా ఈ మూవీ తెలుగు భాషలోనే కాకుండా కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక శ్రీజిత్ ఎడవనా మ్యూజిక్ డైరెక్టర్‌గా 'కాదల్ ఎన్ కవియే', 'నెంజోడు చేరు' వంటి తమిళ, మలయాళ సినిమాలకు పని చేశారు. ఇప్పుడు 'సికాడా'తో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమా పాటలకు రవితేజ అమరనారాయణ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి నవీన్ రాజ్ కొరియోగ్రాఫర్, శైజిత్ కుమారన్ ఎడిటర్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story