సినిమా

comedian Pandu : కరోనాతో కమెడియన్‌ పాండు కన్నుమూత.. !

కరోనా... కోలీవుడ్ చిత్రపరిశ్రమలో మరో విషాదాన్ని నింపింది, ప్రముఖ కమెడియన్‌ పాండు(74) కరోనా కారణంగా కన్నుమూశారు.

comedian Pandu :  కరోనాతో కమెడియన్‌ పాండు కన్నుమూత.. !
X

కరోనా... కోలీవుడ్ చిత్రపరిశ్రమలో మరో విషాదాన్ని నింపింది, ప్రముఖ కమెడియన్‌ పాండు(74) కరోనా కారణంగా కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు, పాండుకు భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన భార్యకి కరోనా సోకడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. పాండు మృతి పట్ల చిత్రపరిశ్రమలోని పలువురు సంతాపం తెలుపుతున్నారు. కాగా 1970 లో మానవన్ చిత్రంతో ఆయన నటుడిగా అరంగేట్రం చేశారు. ఆయన సోదరుడు ఇడిచాపులి సెల్వరాజ్‌ కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు.

Next Story

RELATED STORIES