Bheemla Nayak Release Date: మళ్లీ పోస్ట్‌పోన్ అవుతున్న 'భీమ్లా నాయక్'.. ఏకంగా ఏప్రిల్‌కు..

Bheemla Nayak Release Date: మళ్లీ పోస్ట్‌పోన్ అవుతున్న భీమ్లా నాయక్.. ఏకంగా ఏప్రిల్‌కు..
Bheemla Nayak Release Date: ఫిబ్రవరి 15 దాటితే ఇంకా ఏ వారంలోనూ భీమ్లా నాయక్ విడుదలయ్యే ఛాన్స్ లేదు.

Bheemla Nayak Release Date: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' సినిమా గురించి పవన్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సంక్రాంతికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. ఆ తర్వాత సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలన్నీ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చాయి. ఫిబ్రవరిలో విడుదలను ఖరారు చేసుకున్న భీమ్లా నాయక్ మరోసారి వాయిదా పడినట్టు కనిపిస్తోంది.

మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న యాక్షన్ డ్రామా 'అయ్యపనుమ్ కోషియుమ్'ను తెలుగులో 'భీమ్లా నాయక్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పవన్‌తో పాటు రానా కూడా హీరోగా నటిస్తున్నాడు. సంయుక్త మీనన్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అసలైతే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకున్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ఫిబ్రవరి 15 దాటితే ఇంకా ఏ వారంలోనూ భీమ్లా నాయక్ విడుదలయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రతీ శుక్రవారం ఏదో ఒక పాన్ ఇండియా సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. అందుకే భీమ్లా నాయక్ ఏప్రిల్ 1న విడుదల కానున్నట్టు ఫిల్మ్ సర్కి్ల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'గని' సినిమా ఫిబ్రవరి 15న విడుదలను ఖరారు చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే భీమ్లా నాయక్ పోస్ట్‌పోన్ అయినట్టే అనుకుంటున్నారు పవన్ అభిమానులు.

Tags

Read MoreRead Less
Next Story