సినిమా

Dasari Narayana Rao: సివిల్ కేసులో చిక్కుకున్న దాసరి ప్రభు, అరుణ్‌‌..

Dasari Narayana Rao: దివంగత సినీ దర్శకులు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారి చేసింది.

Dasari Narayana Rao (tv5news.in)
X

Dasari Narayana Rao (tv5news.in)

Dasari Narayana Rao: దివంగత సినీ దర్శకులు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారి చేసింది. ఆయన తనయులు దాసరి అరుణ్‌, దాసరి ప్రభులకు ఆర్డర్‌ 34, సీపీసీ 151 సెక్షన్ల కింద సివిల్‌ కోర్టు నోటీసులు పంపింది. వ్యాపార లావేదేవిల్లో భాగంగా ఓ ప్లాంట్‌ నిర్మాణం కోసం సోమ శేఖర్‌రావు అనే వ్యాపారి వద్ద ప్రభు, అరుణ్‌లు 2 కోట్ల 11 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు.

తిరిగి డబ్బులు చెల్లించడంలో వారు జప్యం చేస్తున్నారంటూ సోమశేఖర్‌ రావు సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. దాసరి ప్రభు, అరుణ్‌ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడంలేదని, త్వరలో తన డబ్బులు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలంటే పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో కోర్టు దాసరి ఇంటికి నోటీసులు పంపుతూ రెండు వారాల్లో డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది.

Next Story

RELATED STORIES