సినిమా

Dil Raju: ఫేక్ ఫ్యాన్.. దిల్ రాజు స్వార్థమే గెలిచింది..

Dil Raju: భీమ్లానాయక్.. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా.. పవన్ ఇమేజ్ తో పోటీలో బలంగా నిలబడిన సినిమా.

Dil Raju: ఫేక్ ఫ్యాన్.. దిల్ రాజు స్వార్థమే గెలిచింది..
X

Dil Raju: భీమ్లానాయక్.. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా.. పవన్ ఇమేజ్ తో పోటీలో బలంగా నిలబడిన సినిమా.. అయితే ఈ రోజు భీమ్లానాయక్ సినిమా సంక్రాంతి బరిలో తప్పుకున్నట్లు ప్రకటించారు దిల్ రాజు అండ్ బ్యాచ్.. అయితే తప్పుకున్నారా..? తప్పించారా..? అనేది ఇక్కడ గమనించాలి.. ఆర్.ఆర్.ఆర్ కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది.. అయితే ఈ సినిమాకి సీజన్ లతో పనిలేదు.. కానీ మొదటి ప్రకటించిన తేదీ అక్టోబర్ 13.

సంక్రాంతి బరిలో మొదట నిలిచిన సినిమా భీమ్లానాయక్.. తర్వాత ప్రకటించిన రాథేశ్యామ్, బంగార్రాజు బరిలో నిలిచాయి.. కానీ ఈ రేస్ లో భీమ్లానాయక్ ని తప్పించడంలో కీలక పాత్ర పోషించారు నిర్మాత దిల్ రాజు.. రిలీజ్ డేట్స్ ప్రకటించిన తర్వాత రాయబారాలు నడిపారు. ఆర్. ఆర్.ఆర్. కి భీమ్లానాయక్ కి దిల్ రాజు నైజాం డిస్ట్రిబ్యూటర్ అవడంతో బాల్ దిల్ రాజు కోర్ట్ లో పడింది. దీంతో తన స్వార్ధం కోసం భీమ్లానాయక్ ని బరినుండి తప్పించారు.

ఈ రోజు ప్రెస్ మీట్ లో కూర్చున్న పెద్ద మనుషులకు ఫిబ్రవరి ఎంత పెద్ద సీజనో అందరికీ తెలుసు.. మరి బలవంతంగా ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ ని పంపించడం ఎలాంటి న్యాయం అవుతుంది. ఛాంబర్ కాకుండా ఒక ప్రైవేట్ గిల్డ్ నడుపుతూ ఇండస్ట్ర్రీని తప్పదోవ పట్టిస్తున్న ముఠాతో కలసి ఈ గోంతుకోసే కార్యక్రమాన్ని సక్సెస్ పుల్ గా చేసాడు దిల్ రాజు.

ఆర్. ఆర్. ఆర్ , రాధే శ్యామ్ లు పాన్ ఇండియా సినిమాలు అంటూ భీమ్లానాయక్ సినిమా ను చిన్నగా చూపే ప్రయత్నం చేసాడు. పవన్ కళ్యాణ్‌కి ఉండే ఇమేజ్ కి భీమ్లానాయక్ వంటి క్యారెక్టర్ పడితే పాన్ ఇండియా సినిమా ల పప్పులు ఇక్కడ ఏమీ పనిచేయవు.. ఈ నిజం ప్రతి సినిమా ప్రేక్షకుడికి తెలుసు.. అయినా దిల్ రాజు కదిపిన పావులకు బలైంది మాత్రం సితార ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే..

అయినా భీమ్లానాయక్ ని వాయిదా వేస్తున్నాం అనే విషయం ప్రొడ్యూసర్స్ చెప్పాలి.. కానీ వీళ్ళు చెప్పడం చూస్తుంటే అది ఎంత బలవంతపు నిర్ణయమో అర్దం అవుతుంది.. సంక్రాంతి కి ఎప్పుడూ ఎదురు చూసేవి పెద్ద హీరోల సినిమాలే.. కనీసం నాలుగు సినిమాలకు ఈ సీజన్ లో అవకాశం ఉంటుంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి మాస్ హీరో సినిమాని ఇలా బలవంతంగా వాయిదా వేసేందుకు తెగబడిన ఈ పెద్ద మనుషులు చిన్న సినిమాల విషయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తారో ఊహిస్తేనే భయం వేస్తుంది.

ఫ్యాన్స్ అందరూ ఈ వార్త తో పూర్తిగా నిరాశ చెందారు. తన స్వార్ధానికి సినిమా ల బిజినెస్ లను, హీరోల ఇమేజ్ లను తాకట్టు పెడుతూ.. దిల్ లేని రాజు గా మరోసారి నిరూపించుకున్నాడు రాజు. ఈ సీజన్ ఆర్.ఆర్.ఆర్ కోసం భీమ్లానాయక్ ని పక్కకు జరిపి తన స్వార్ధం తాను చూసుకున్నాడు. తమ సినిమా వాయిదా పడిందని చెప్పేందుకు నిర్మాత నాగవంశీ కూడా ఇష్టపడలేదు..

అందుకే ఆ వార్తను చెప్పమని వాళ్ళకే వదిలేసారు. ఇండస్ట్రీకి పెద్దలుగా చెలామణి అవుతున్న వారు తమ స్వార్ధానికి తప్ప సినిమా కోసం చేసేది ఏమీ లేదని నిరూపించాడు దిల్ రాజు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే దిల్ రాజు భీమ్లానాయక్ వాయిదాకు కారణం అయ్యాడు.

Next Story

RELATED STORIES