బాలయ్యకు హీరోయిన్ ఫిక్స్

బాలయ్యకు హీరోయిన్ ఫిక్స్
టాలీవుడ్ లోని మోస్ట్ వాంటెడ్ హీరోస్ లో నందమూరి నటసింహం మొదటి వరుసలో ఉన్నాడు

నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లోని మోస్ట్ వాంటెడ్ హీరోస్ లో నందమూరి నటసింహం మొదటి వరుసలో ఉన్నాడు. అందుకే.. బాలయ్యతో సినిమా చేయడానికి యువ దర్శకులంతా పోటీపడుతుంటారు. లేటెస్ట్ గా ఆ ఆఫర్ బాబీకి దక్కింది. ‘వాల్తేరు వీరయ్య‘తో ఘన విజయాన్నందుకున్న బాబీ.. ఇప్పుడు బాలకృష్ణతో సినిమాకి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రం ముహూర్తాన్ని కూడా పూర్తిచేసుకుంది. లేటెస్ట్ గా బాలకృష్ణ-బాబీ మూవీలో హీరోయిన్ ఫిక్సయ్యిందట.

నటసింహం బాలకృష్ణ స్పీడు మామూలుగా లేదు. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు మించిన రీతిలో వరుస సినిమాలతో బిజీగా సాగుతున్నాడు బాలయ్య. పైగా ఇప్పుడు బాలకృష్ణ మంచి సక్సెస్ జోష్ లో ఉన్నాడు. ‘అఖండ‘.. ఆ తర్వాత వెంటనే ‘వీరసింహారెడ్డి‘ చిత్రాల విజయాలు.. నటసింహం బాక్సాఫీస్ స్టామినాను మరోసారి రుజువు చేశాయి.


‘వీరసింహారెడ్డి‘ తర్వాత బాలకృష్ణ.. అనిల్ రావిపూడి సినిమాతో బిజీ అయ్యాడు. ఇటీవలే ఈ చిత్రానికి ‘భగవంత్ కేసరి‘ అనే పవర్ ఫుల్ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ.. స్పెషల్ వీడియోని విడుదల చేసింది టీమ్. ‘భగవంత్ కేసరి‘ స్పెషల్ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక.. ‘భగవంత్ కేసరి‘ చిత్రీకరణ దశలో ఉండగానే బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకి ముహూర్తాన్ని పూర్తిచేశాడు నటసింహం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీలో నెవర్ బిఫోర్ బాలయ్యను ప్రెజెంట్ చేయబోతున్నాడట బాబీ.

‘ద వరల్డ్ నోస్ హిమ్.. బట్ నో వన్ నోస్ హిస్ వరల్డ్‘ అంటూ చిత్రీకరణకు ముందే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసి.. బాలకృష్ణ సినిమాపై అంచనాలను పెంచేశాడు డైరెక్టర్ బాబీ. ఇక.. లేటెస్ట్ గా బాలయ్య సినిమాకి సంబంధించిన కీలకమైన కాస్టింగ్ పైనా దృష్టిపెట్టాడట. ఈ మూవీలో నటసింహంకి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసుకోబోతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. టాలీవుడ్ లో ఇప్పటివరకూ చాలామంది స్టార్ హీరోస్ తో నటించిన తమన్నాకి.. బాలయ్యతో ఇది తొలిసారి కాబోతుంది. మొత్తంమీద.. బాలకృష్ణతో తమన్నా కాంబినేషన్.. సిల్వర్ స్క్రీన్ పై ఏరీతిన అలరిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story