సినిమా

RGV on Pushpa : పుష్ప ట్రైలర్... ఆర్జీవీ కామెంట్స్...!

RGV on Pushpa : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం పుష్ప.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ ఈసినిమాని నిర్మిస్తోంది.

RGV on Pushpa : పుష్ప ట్రైలర్... ఆర్జీవీ కామెంట్స్...!
X

RGV on Pushpa : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం పుష్ప.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ ఈసినిమాని నిర్మిస్తోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్‌' పేరుతో డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమానుంచి తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.. ఈ ట్రైలర్ కి వీపరితమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలావుండగా చిత్ర ట్రైలర్ పైన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఇలాంటి రియలిస్టిక్ పాత్రలో నటించడానికి భయపడని సూపర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, రజినీకాంత్ మిగిలినవారంతా ఇలాంటి పాత్రలు చేయగలరా అని సవాల్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు వర్మ.. ఇక చివర్లో పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్" అంటూ డైలాగ్ రాసుకొచ్చాడు.


Next Story

RELATED STORIES