RGV : పవన్ అభిమానిగా నేను బాధపడ్డాను.. భీమ్లానాయక్ ట్రైలర్ పై వర్మ..!

RGV : పవన్ అభిమానిగా నేను బాధపడ్డాను.. భీమ్లానాయక్ ట్రైలర్ పై వర్మ..!
RGV : నిజాయితీగా చెప్పాలంటే ట్రైలర్ చూసిన తర్వాత భీమ్లానాయక్‌కు బదులుగా డేనియల్ శేఖర్ అని పిలవాలని ఉందని ట్వీట్ చేశాడు వర్మ

RGV : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి మెయిన్ లీడ్‌‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ .. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా సినిమా ట్రైలర్ ని నిన్న(సోమవారం) రిలీజ్ చేశారు మేకర్స్.

అయితే చిత్ర ట్రైలర్ పై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. నిజాయితీగా చెప్పాలంటే ట్రైలర్ చూసిన తర్వాత భీమ్లానాయక్‌కు బదులుగా డేనియల్ శేఖర్ అని పిలవాలని ఉందని ట్వీట్ చేశాడు వర్మ.. అంతేకాకుండా ఉత్తరాదిలో బాహుబలి కారణంగా పవన్ కళ్యాణ్ కంటే రానాకు చాలా ప్రజాదరణ ఉందని, ఈ చిత్రంలో అతడు విలన్‌గా కాకుండా హీరోగా మారే అవకాశం ఉందని తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

రానాని ప్రమోట్ చేయడానికి మేకర్స్ పవన్ కళ్యాణ్‌ని వాడుకున్నారని అర్ధమయ్యిందని వర్మ రాసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ అభిమానిగా తాను ఈ విషయంలో హర్ట్ అయ్యానని చెప్పుకొచ్చాడు వర్మ.. ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నిత్యామీనన్ మరియు సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా, దీనికి థమన్ ఎస్ సంగీతం అందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story