సినిమా

RGV : అమ్మాయి కత్తిలా ఉంది.. నేను సంస్కారం ఉన్న మనిషిని.. : ఆర్జీవి

RGV : ఈ ఏడాదికి గుడ్ బై చెబుతూ వచ్చే ఏడాదికి గ్రాండ్‌‌‌గా వెల్ కమ్ చెప్పడం కోసం బుల్లితెర నటీనటులు కలిసి 'పెళ్ళాం వద్దు.. పార్టీ ముద్దు' అనే ప్రోగ్రాం

RGV : అమ్మాయి కత్తిలా ఉంది.. నేను సంస్కారం ఉన్న మనిషిని.. :  ఆర్జీవి
X

RGV : ఈ ఏడాదికి గుడ్ బై చెబుతూ వచ్చే ఏడాదికి గ్రాండ్‌‌‌గా వెల్ కమ్ చెప్పడం కోసం బుల్లితెర నటీనటులు కలిసి 'పెళ్ళాం వద్దు.. పార్టీ ముద్దు' అనే ప్రోగ్రాం షూట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో హాల్ చేస్తున్నాయి. ఈ ప్రోగ్రాంకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చీఫ్ గెస్ట్‌‌గా హాజరై సందడి చేశాడు. తనదైన స్టైల్ లో పంచులు వేసి కడుపుబ్బా నవ్వించాడు.

వర్మ, హైపర్ ఆది, వర్షిణి, ఆటో రామ్ ప్రసాద్, హిమజ, రోహిణి కలిసి ఓ స్కిట్ చేశారు. ఇందులో భాగంగా యాంకర్ వర్షిణిని ఉద్దేశించి అమ్మాయి కత్తిలా ఉందని కామెంట్ చేశాడు వర్మ.. వెంటనే మరి నేనెలా ఉన్నానని రోహిణి అడగగా పక్కోడి భార్య గురించి నేను మాట్లాడను.. సంస్కారం ఉన్న మనిషిని అంటూ పంచ్ వేశాడు ఆర్జీవి.

ఆ వెంటనే వర్ష గురించి ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్లు వేయదు.. బయటకు వస్తేనే ఇలాంటి డ్రెస్లు వేస్తుంది ఎలా లవ్ చేయమంటారని వర్మని అడిగాడు. దీనిపై వర్మ స్పందిస్తూ.. అలాంటి అమ్మాయినే ప్రేమించాలి.. నేనైతే అలాంటి అమ్మాయినే ప్రేమిస్తా అంటూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు వర్మ. ఇక చివర్లో రష్మి డాన్స్ ఆకట్టుకుంది. ఈ ప్రోగ్రాం మొత్తం శుక్రవారం టెలికాస్ట్ కానుంది.Next Story

RELATED STORIES