సినిమా

'కింగ్' వర్సెస్ 'కంత్రీ'.. బిగ్‌ఫైట్ ఇన్ స్మాల్ స్క్రీన్

ఒకర్ని ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది.. మరొకరు ఏం మాట్లాడినా వినాలనిపిస్తుంది. ఇద్దరూ ఒకేసారి బుల్లితెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులుండవు.

కింగ్ వర్సెస్ కంత్రీ.. బిగ్‌ఫైట్ ఇన్ స్మాల్ స్క్రీన్
X

ఒకర్ని ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది.. మరొకరు ఏం మాట్లాడినా వినాలనిపిస్తుంది. ఇద్దరూ ఒకేసారి బుల్లితెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఎన్టీఆర్ జెమినీలో ఎవరు మీలో కోటీశ్వరులు తో ప్రేక్షకుల మనసులను గెలవడానికి సిద్ధపడుతుంటే.. కింగ్ నాగార్జున 60 ఏళ్లు దాటినా అదే ఉత్సాహంతో 5వ సీజన్‌‌ని హోస్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు.

మరి ఈ రెండూ ప్రేక్షకాదరణ పొందిన షోస్ కాబట్టి క్లాష్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చానెల్ యాజమాన్యానికి ఉంటుంది. ఇప్పటికే డేట్ ప్రకటించిన ఎవరు మీలో కోటీశ్వరులు ఆగస్టు 22 నుంచి టెలికాస్ట్ కానుంది. ఇంతకు ముందు ఈ రెండు షోస్ 'మా' చానెల్‌లోనే వచ్చేవి. మరి ఈసారి ఆ బాధ్యత జెమినీ తీసుకుంది.

బిగ్ బాస్ సీజన్ 1కి హోస్ట్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత తారక్ స్మాల్ స్క్రీన్‌లోకి మరోసారి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అతడిని తిరిగి చిన్న తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కూడా ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతోంది.

రెండు షోలు త్వరలో ప్రసారం కానున్నందున ఇద్దరు టాలీవుడ్ తారలు వచ్చే నెలలో ఒక చిన్న స్క్రీన్ క్లాష్‌ని కలిగి ఉన్నారు. ఏ షోకి మంచి టిఆర్‌పిలు లభిస్తాయో చూడాలి.

ఇదిలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ తన అప్ కమింగ్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' షూట్ పూర్తి అయింది. ఈ చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో దానయ్య నిర్మించారు. మరోవైపు, నాగార్జున తదుపరి చిత్రం 'బంగార్రాజు' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా రెండవ షెడ్యూల్ వచ్చే వారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది.

Next Story

RELATED STORIES