సినిమా

F3 Movie: 'ఎఫ్ 3' విడుదల మళ్లీ వాయిదా.. ఆ సినిమానే దీనికి కారణం..

F3 Movie: స్టార్ హీరోలు మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏ మాత్రం వెనకాడట్లేదు.

F3 Movie (tv5news.in)
X

F3 Movie (tv5news.in)

F3 Movie: టాలీవుడ్‌లో మల్టీ స్టారర్‌ల హవా కొనసాగుతోంది. స్టార్ హీరోలు సైతం మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏ మాత్రం వెనకాడట్లేదు. అయితే వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాలన్నీ పోటీ పడడం విశేషం. కానీ సినిమా విడుదలల విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. ఇటీవల ఓ సినిమా దాని విడుదల తేదీని వాయిదా చేయడం వల్ల మరో సినిమాపై ఆ ప్రభావం పడింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా అప్పట్లో సూపర్ డూపర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా హిట్ అందుకుంది. అందుకే అనిల్ రావిపూడి ఈసారి డబుల్ డోస్‌తో ఎఫ్ 3ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయిన తర్వాత పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఆఖరికి ఒక విడుదల తేదీ ఖరారు చేసుకున్నా అది కూడా ఈసారి వాయిదా పడాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎఫ్ 3 సినిమా విడుదల ఎప్పుడో జరగాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ వచ్చింది. ఇటీవల ఎఫ్ 3 చిత్రాన్ని ఫిబ్రవరీ 25న విడుదల చేస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది మూవీ టీమ్. తాజాగా జనవరిలో విడుదల కావాల్సిన భీమ్లా నాయక్.. ఫిబ్రవరీ 25కు వాయిదా పడింది. దీంతో ఎఫ్ 3 సినిమా విడుదల ఏప్రిల్ 25కు వాయిదా పడింది.

ఎఫ్ 3 చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు.. భీమ్లా నాయక్ విడుదలను వాయిదా వేసుకున్నందుకు మూవీ టీమ్‌కు థాంక్యూ చెప్పుకున్నాడు. ఈ రెండు సినిమాల గురించి ఫన్నీ విషయం ఏంటంటే.. వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో రానా.. భీమ్లా నాయక్ సినిమా చేస్తుండగా.. రానా బాబాయ్ వెంకటేశ్‌తో వరుణ్ తేజ్.. ఎఫ్ 3 సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ బాబాయ్‌లు, అబ్బాయిల సినిమా వార్ చూద్దామనుకున్న ప్రేక్షకులకు.. ఎఫ్ 3 రేస్ నుండి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మిస్ అయ్యింది.

Next Story

RELATED STORIES