Family Dhamaka : సెప్టెంబర్ 8 నుంచి ఎంటర్టైన్మెంట్ షురూ

Family Dhamaka : సెప్టెంబర్ 8 నుంచి ఎంటర్టైన్మెంట్ షురూ
స్ట్రీమింగ్ కు సిద్దమైన 'ఫ్యామిలీ ధమాకా'.. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కానున్న విశ్వక్ సేన్

బాలయ్యతో 'అన్ స్టాపబుల్' అనే షో ద్వారా హిట్ కొట్టిన 'ఆహా'.. ఇప్పుడు తెలుగు ఆడియెన్స్‌కి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు మరో సారి సిద్ధమైంది. రియాలిటీ షో ‘ఫ్యామిలీ ధ‌మాకా’ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి రెడీ అయింది. ఇది సెప్టెంబ‌ర్ 8 నుంచి ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ప్ర‌తీ శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ అంద‌రినీ ఆక‌ట్టుకోనున్న ఈ షో.. ప్రేక్ష‌కుల్లో ఉత్తేజాన్ని పెంచేలా ఎన్నో భావోద్వేగాలు, స‌వాళ్ల క‌ల‌యిక‌గా ఓ రోల‌ర్ కోస్ట‌ర్‌లా మ‌న ముందుకు రానుంది. కుటుంబాల మ‌ధ్య అనుబంధాలను తెలియ‌జేస్తూనే అంద‌రినీ ఈ షో ఎంట‌ర్‌టైన్ చేయనుంది. ఈ షోతో టాలీవుడ్ వెర్స‌టైల్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ హోస్ట్‌గా మారుతుండ‌టం విశేషం. త‌న‌దైన హోస్టింగ్‌తో న‌వ్వుల ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల‌ను కూడా భాగం చేయ‌బోతున్నారు. ఈ షోను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఫ్రిమాంటిల్ ఇండియా నిర్మిస్తోంది.

‘‘ఆహా’వారి ఫ్యామిలీ ధమాకా షోతో నేను హోస్ట్‌గా మార‌టం మ‌ర‌చిపోలేని అనుభూతి. ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ షో ద్వారా ఎన్నో కుటుంబాలను కలిసాను. చాల ఆనందంగా ఉంది. ఈ తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి నేను ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’అని వెర్స‌టైల్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.


‘‘ప్రేక్ష‌కులు కు ఉహించ‌ని కొత్త‌ద‌నంతో కూడిన ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించ‌టంలో ఆహా వాళ్లు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వాటిలో ఫ్యామిలీ ధ‌మాకా ఒక‌టి. విశ్వ‌క్ సేన్ ఈ షోను హోస్ట్ చేయ‌టం అనేది అందరిలోనూ ఆస‌క్తిని పెంచుతోంది. క‌చ్చితంగా ఈ షో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది’’అని సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నాన్ సబ్ స్క్రిప్ష‌న్ రెవెన్యూ బిజినెస్‌, కంటెండ్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని అని అన్నారు.

‘‘ఆహాతో మా జ‌ర్నీ ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న ఐడ‌ల్ రెండు సీజ‌న్స్‌లో మేం క‌లిసి ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేశాం. ఇప్పుడు ఫ్యామిలీ ధ‌మాకాతో మీ ముందుకు రాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఫ్రిమాంటిల్‌లో అతి పెద్ద‌దైన గేమ్ షో ఫ్యామిలీ ఫ్యూడ్ ను ఆధారంగా చేసుకుని ఫ్యామిలీ ధ‌మాకాను రూపొందించాం. ఈ ఫ్యామిలీ ప్ర‌పంచ వ్యాప్తంగా 63 ప్రాంతాల్లో రూపొందిస్తున్నారు. ఓ దేశంగా చూస్తే మ‌నది వ‌సుదైక కుటుంబం అనాలి. అందులోని ప‌లు కోణాలు,హాస్యం, భావోద్వేగాలు వీట‌న్నింటినీ క‌ల‌గ‌లిపి ప్ర‌శ్న‌లుగా చేసి విశ్వ‌క్ సేన్ ప్రేక్ష‌కుల‌ను అడుగుతారు. అది కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ పంథాలో. ఇది ప్ర‌తీ ఒక‌రికీ న‌చ్చుతుంది’’ అని ఫ్రిమాంట‌ల్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆరాధ‌న బోలా వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story