సినిమా

Pushpa Part 2 : ఎవరా మురుగన్ .. పుష్ప2లో సుకుమార్ వీటికి క్లారిటీ ఇస్తాడా?

Pushpa Part 2 : పాన్ ఇండియా మూవీగా సుక్కు, బన్నీ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య తాజాగా పుష్ప మూవీ రిలీజైంది. విడుదలైన ఫస్ట్ డే నుంచే సినిమాకి మంచి టాక్ రావడంతో వసూళ్ళ పరంగా సినిమా దూసుకుపోతుంది.

Pushpa Part 2 : ఎవరా మురుగన్ .. పుష్ప2లో సుకుమార్ వీటికి క్లారిటీ ఇస్తాడా?
X

Pushpa Part 2 : పాన్ ఇండియా మూవీగా సుక్కు, బన్నీ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య తాజాగా పుష్ప మూవీ రిలీజైంది. విడుదలైన ఫస్ట్ డే నుంచే సినిమాకి మంచి టాక్ రావడంతో వసూళ్ళ పరంగా సినిమా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 'పుష్ప: ది రూల్‌'(Pushpa: The rule) టైటిల్‌తో పార్ట్ 2 రానుంది. ఓ మామూలు కూలీగా ఉండే పుష్ప రాజ్.. స్మగ్లింగ్‌ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడో చూపించిన సుకుమార్.. రెండో పార్ట్ లో ఏం చూపిస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పార్ట్ వన్ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే వదిలేశాడు సుకుమార్.. మరి వాటికి క్లారిటీ ఇస్తాడా? లేదా?

మంగళంశ్రీనుగా విలన్ రోల్ లో సునీల్‌ సరికొత్తగా చూపించాడు సుకుమార్.. తన బావమరిదిని చంపిన పుష్ప పై మంగళంశ్రీను ప్రతీకారం తీర్చుకోవడానికి ఎం చేశాడనే క్లారిటీ ఇవ్వొచ్చు.

♦ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా తనదైన ముద్ర వేసింది అనసూయ.. అయితే పాత్ర పుష్ప వన్ లో ద్రాక్షాయణిగా ఆమె పాత్ర అంతగా ఎలివేట్ కాలేదు.. పుష్ప2లో ఆమె పాత్రకి సుకుమార్ ప్రాధాన్యత ఇస్తాడా? లేదా?

♦ ఫహద్‌ ఫాజిల్‌ పాత్రను చివర్లో చూపించాడు సుకుమార్.. పుష్పరాజ్‌ చేతిలో అవమానానికి గురైన అతను పుష్ప పై ఒంటరిగానే ప్రతీకారం తీర్చుకున్నడా లేదా మంగళంశ్రీను, ద్రాక్షాయణి హెల్ప్ తీసుకుంటాడా?

♦ స్మగ్లింగ్ చేసిన ఎర్రచందనాన్ని చెన్నైలోని మురుగన్‌ అనే వ్యక్తికీ అమ్మేస్తుంటారు. ఇంతకీ ఎవరా మురుగన్.. పార్ట్ 2లో సుకుమార్ చూపిస్తాడా?

♦ పుష్పరాజ్‌ తండ్రి ఎవరు? సినిమా మొత్తంలో అక్కడక్కడ ఈ పాయింట్ ని టచ్ చేసి వదిలేశాడు సుకుమార్.. మరి పార్ట్ 2 లో అతను ఎవరు అనేదానిపైన ఓ క్లారిటీ ఇస్తాడా చూడాలి?

♦ సుకుమార్ అంటేనే పక్కా ఐటెం సాంగ్.. పుష్ప వన్ లో సామ్ తో ఐటెం సాంగ్ చేయించిన సుక్కు.. రెండో పార్ట్ లో ఐటెం సాంగ్ పెడతాడా? పెడితే అది చేసేది ఎవరు?

ఇంకా ఇలాంటివి సినిమాలో చాలానే ఉన్నాయి. మరి సుకుమార్ వీటికి పార్ట్ లో క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.

Next Story

RELATED STORIES