Don 3 : 'డాన్ ఫ్రాంచైజీ' పై డైరెక్టర్ అఫిషియల్ అనౌన్స్ మెంట్

Don 3 : డాన్ ఫ్రాంచైజీ పై డైరెక్టర్ అఫిషియల్ అనౌన్స్ మెంట్
'డాన్ 3'తో కొత్త శకం ప్రారంభమవుతుందన్న డైరెక్టర్ ఫర్హాన్

హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో 'డాన్' ఒకటి. దీని మూడవ భాగం కోసం అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఈ చిత్రం గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు అడుగుతున్నారు. ఇంతకుముందు, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కమర్షియల్ స్పేస్‌లో విస్తృతమైన ప్రాజెక్ట్‌లను చేయాలనుకుంటున్నందున డాన్ చిత్రాల నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇది ఇప్పుడు యువ తరానికి చెందిన స్టార్‌ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ తో ఫ్రాంచైజీని రీబూట్ చేయడానికి దారితీసింది. కొత్త డాన్‌గా రణ్ వీర్ సింగ్‌ని ఖరారు చేసినట్లు సమాచారం. కాగా తాజాగా డాన్ 3 వర్కింగ్ ప్రాసెస్ లో ఉందని ఫర్హాన్ అధికారికంగా ప్రకటించారు.

ఎట్టకేలకు 'డాన్ 3' చిత్రం రాబోతోందని దర్శకుడు ఫర్హాన్ అక్తర్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 8న ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. '3' లోగోను చూడగలిగే వీడియోను పంచుకున్నాడు. ఇది మూడవ భాగాన్ని సూచిస్తున్నట్టుగా ఉంది. అంతేకాదు ఇది డాన్ 3 అని చెప్పేందుకు సాక్ష్యంగా ఫ్రాంచైజీ థీమ్ మ్యూజిక్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయడం కూడా ఈ వీడియోలో వినవచ్చు. ఈ వీడియోకు ఆయన “కొత్త యుగం ప్రారంభమవుతుంది” అనే ట్యాగ్‌లైన్ ను కూడా జత చేశారు.

ఈ చిత్రంలోని నటీనటుల గురించి ఆయన ప్రకటించనప్పటికీ, రణ్‌వీర్ సింగ్ మాత్రం ప్రధాన పాత్రలో నటించినున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. రణ్ వీర్ ప్రస్తుతం ఇటీవలే విడుదలైన 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' విజయాన్ని ఎంజాయ్ చేస్తూ, బిజీగా గడుపుతున్నాడు. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త అవతార్‌లో తన అభిమానులను ఆకట్టుకోవడానికి వస్తున్నాడు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఓ ప్రకటన వీడియోను కూడా చిత్రీకరించారు.

ఎట్టకేలకు తమ నిరీక్షణకు తెరపడడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఈ వీడియోకు పలు కామెంట్లు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. సినిమా పట్ల తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రణవీర్ ఫస్ట్ లుక్ చూడాలని కూడా డిమాండ్ చేశారు. "మీరు డైరెక్టర్ సీటులో చేరి చాలా రోజులైంది ఫర్ఙాన్.. కథాంశంలో హుందాతనం కోసం ఆశిస్తున్నాను" అని ఒకరు కామెంట్ చేయగా.. "బహుశా.. ఇది బడాస్ బాలీవుడ్ పునరాగమనం" అని ఇంకొకరు రాసుకువచ్చారు. "రణవీర్ సింగ్ నుండి అల్లాదీన్ ఖిల్జీ తరహా నటనను ఆశిస్తున్నాను" అంటూ మరికొందరు కామెంట్ సెక్షన్ లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

రణవీర్ సింగ్ డాన్‌గా పరిచయం కానున్న ఈ సినిమా టీజర్ ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తర్వాత ఈ పాత్రను పోషించే బాధ్యతను రణ్ వీర్ తీసుకున్నాడు. కాగా ఈ మూవీ టీజర్ ను ఆగస్ట్ 11న సినిమాల్లోకి రానున్న 'గదర్ 2' ప్రింట్‌లతో జతచేయనున్నట్టు సమాచారం.





Tags

Read MoreRead Less
Next Story