సినిమా

Faria Abdullah: 'బంగార్రాజు'తో చిట్టి స్టెప్పులు.. ఫోటోలు వైరల్..

Faria Abdullah: ఒకప్పుడు హీరోయిన్లు స్పెషల్ సాంగ్ చేయాలంటే హీరోయిన్‌గా వారి కెరీర్ ఎండ్ అయిపోయి ఉండాలి.

Faria Abdullah (tv5news.in)
X

Faria Abdullah (tv5news.in)

Faria Abdullah: ఒకప్పుడు హీరోయిన్లు స్పెషల్ సాంగ్ చేయాలంటే హీరోయిన్‌గా వారి కెరీర్ ఎండ్ అయిపోయి ఉండాలి. అలాంటప్పుడే వారు స్పెషల్ సాంగ్స్ చేయడానికి రెడీ అవుతారు. కానీ రోజులు మారిపోయాయి. ఒకపక్క హీరోయిన్‌గా రాణిస్తూనే.. మరోపక్క స్పెషల్ సాంగ్స్ చేయడానికి సిద్ధమయిపోతున్నారు నటీమణులు. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో హీరోయిన్ చేరిపోయింది.

ఇటీవల అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుంది అనగానే ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇక ఈ లిస్ట్‌లో ముందు నుండే శృతి హాసన్, తమన్నా లాంటి హీరోయిన్లు ఉన్నారు. తాజాగా ఓ అప్‌కమింగ్ నటి కూడా ఓ సీనియర్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అయిపోయింది.

'జాతిరత్నాలు' చిత్రం ఏ అంచనాలు లేకుండా వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది ఫరియా అబ్దుల్లా. ఇక ఈ సినిమా తర్వాత తాను హీరోయిన్‌గా ఇంకా ఏ సినిమాలో కనిపించలేదు. అఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో మాత్రం గెస్ట్ రోల్‌లో కనిపించింది.

కొడుకు సినిమాలో గెస్ట్‌లో కనిపించిన ఫరియా అబ్దుల్లా.. తండ్రి సినిమాలో ఏకంగా స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున, నాగచైతన్య, రమ్యక్షష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్న బంగార్రాజులో మరో హీరోయిన్ కూడా ఉండే ఛాన్స్ ఉందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ రూమర్స్ నిజమని తెలుస్తోంది. బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న ఫరియా ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల అయ్యాయి. ఇవి కాసేపట్లోనే వైరల్ అయ్యాయి కూడా.

Next Story

RELATED STORIES