సినిమా

Unstoppable with NBK: మంచు ఫ్యామిలీతో బాలయ్య ముచ్చట్లు..

Unstoppable with NBK: మనకు చాలా ఇష్టమైన నటీనటులను బుల్లితెరపై చూస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది..

Unstoppable with NBK: మంచు ఫ్యామిలీతో బాలయ్య ముచ్చట్లు..
X

Unstoppable with NBK: మనకు చాలా ఇష్టమైన నటీనటులను బుల్లితెరపై చూస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది.. వారు మనకు మరింత దగ్గరయినట్టుగా అనిపిస్తుంటుంది కదా. వారిని సినిమాల్లో వెండితెరపై చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో.. బుల్లితెరపై చూసినప్పుడు కూడా అంతే ముచ్చటేస్తుంది. ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్ అదే ఖుషీలో ఉన్నారు.

ఒకప్పుడు నటీనటులంటే కేవలం వెండితెరకే పరిమితమయ్యేవారు.. సినిమాల ద్వారానే మనల్ని ఎంటర్‌టైన్ చేసేవారు. కానీ కాలం మారిపోయింది. కేవలం సినిమాలతో సరిపెట్టుకోవట్లేదు ప్రేక్షకులు. రియాలిటీ షోలు, గేమ్ షోలు, టాక్ షోలు లాంటి వైపు కూడా మొగ్గుచూపుతున్నారు. అందుకే సీనియర్ హీరో బాలకృష్ణ సైతం టాక్ షోను హోస్ట్ చేయడానికి సిద్ధమయిపోతున్నారు.

బాలకృష్ణ హోస్ట్‌గా పరిచయం కానున్నారు అన్న వార్త బయటికి వచ్చినప్పటి నుండి కేవలం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు దాదాపు అందరు ప్రేక్షకులు ఆయన హోస్టింగ్ ఎలా ఉంటుందో చూద్దామనే ఎదురుచూస్తున్నారు. తాజాగా మరో వార్త ఆయన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'పై మరిన్ని అంచనాలను పెంచేస్తోంది.

'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' ఫస్ట్ ఎపిసోడ్‌కు వచ్చే గెస్ట్ ఎవరు అని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఆ సస్పెన్స్ రివీల్ అయిపోయింది. టాక్ షో సెట్‌లో దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో బాలకృష్ణతో పాటు మోహన్ బాబు ఉన్నారు. అంటే టాక్ షోకు ఫస్ట్ గెస్ట్ మోహన్ బాబు అని చాలామంది ప్రేక్షకులు నిర్దారణకు వచ్చేశారు.


ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందే 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'లో సెకండ్ గెస్ట్ గురించి చర్చ మొదలయ్యింది. ఈ షోలో బాలయ్యతో ముచ్చటించడానికి నాగబాబు వచ్చేస్తున్నాడట. గెస్ట్‌ల గురించి రివీల్ అయిపోయింది. ఇక బాలయ్య హోస్టింగ్ ఎలా ఉంటుందో నేరుగా చూడడానికే అందరూ వెయిటింగ్..

Next Story

RELATED STORIES