సినిమా

Pushpa Movie Update: పుష్పరాజ్‌కు జోడీ అదిరింది..

Pushpa Movie Update: ‘రంగస్థలం’తో మాస్ సినిమాలు కూడా తీయగలనని నిరూపించుకున్నాడు సుకుమార్.

Pushpa Movie Update: పుష్పరాజ్‌కు జోడీ అదిరింది..
X

Pushpa Movie Update: 'రంగస్థలం'తో మాస్ సినిమాలు కూడా తీయగలనని నిరూపించుకున్నాడు సుకుమార్. అందుకే తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్‌తో కూడా అలాంటి మాస్ సినిమానే తెరకెక్కిస్తున్నాడు. వీరి కాంబినేషన్‌లో రానున్న పుష్పను కేవలం పాన్ ఇండియాగా ప్రెజెంట్ చేయడమే కాకుండా ఇందులో స్టైలిష్ స్టార్‌ను డీ గ్లామర్ రోల్‌లో చూపించనున్నాడు కూడా.

ఇప్పటికే మూవీ టీమ్ పుష్ప టీజర్‌ను విడుదల చేసింది. ఇది చూసిన తర్వాత ఇందులో బన్నీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు కొంతవరకు క్లారిటీ వచ్చింది. అయితే తాజాగా పుష్పలో అల్లు అర్జున్‌కు జంటగా నటిస్తున్న కన్నడ బ్యూటీ రష్మిక మందనా ఫస్ట్ లుక్‌ను తన సోషల్ మీడియాలో విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

ఇందులో రష్మిక కూడా కాస్త డీ గ్లామర్‌గానే ఉన్నా తన ఛార్మ్‌తో మ్యాజిక్ చేసేలా కనిపిస్తుంది. శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోవడానికి రష్మిక సిద్ధమవుతోందని అర్థమయింది. అంతే కాక త్వరలోనే శ్రీవల్లి పాట మన ముందుకు రానుందని బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది మైత్రీ మూవీ మేకర్స్.

Next Story

RELATED STORIES