సినిమా

కెరీర్ పీక్స్‎లో ఉండగా..స‌న్యాసం తిసుకున్న స్టార్స్

Bollywood Celebrities: ఐదుగురు స్టార్ హీరో హీరోయిన్స్ మాత్రం సన్యాసం తీసుకున్నారు.

కెరీర్ పీక్స్‎లో ఉండగా..స‌న్యాసం తిసుకున్న స్టార్స్
X

Bollywood Celebrities: సినిమా అంటేనే అదో రంగుల ప్రపంచం. తెరమీద తమను తాము చూసుకోవానే కోరికతో ఎంతో మంది ఇండస్ట్రీల్లోకి అడుగులు పెడతారు. ఒక్క ఛాన్స్ అంటూ అందరి దగ్గరకు తిరుగుతారు. అవకాశం వస్తే కొన్నేళ్లు ఇండస్ట్రీలో ఉంటారు. కొందరైతే ఒకటి రెండు సినిమాల తర్వాత గుడ్ బై చెప్పేస్తారు. ఐదుగురు స్టార్ హీరో హీరోయిన్స్ మాత్రం సన్యాసం తీసుకున్నారు. జీవన‌ త‌త్త్వాన్ని బోధిస్తున్నారు. సినీ కెరీర్ పీక్స్ లో ఉండ‌గా స‌న్యాసంలో చేరిన ఆ స్టార్స్ ఎవరో తెలుసుకుందామా?

బర్ఖా మదన్ :

1984 లో మిస్ ఇండియా ఫైనలిస్ట్ బర్ఖా మదన్. ఈమె బుల్లితెర మీద సీరియల్స్ లో కనిపించింది. ఆ తర్వాత వెండితెర మీద సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తుంది. అవకాశాలు వచ్చి పడుతున్నా ఈ తరుణంలో సిక్కిం లోని బౌద్ధ మఠాన్ని దర్శించడానికి వెళ్లి.. బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ సన్యాసిగా మారిపోయారు బర్ఖా మదన్.


మమతా కులకర్ణి :

కుర్రాళ్ల కలల రాణి మమతా కులకర్ణి. 1990ల్లో బాలీవుడ్ సినిమాల్లో మమతా దూసుకుపోతుంది. మమతా కులకర్ణి శ్రీ చైతన్య గగంగిరి నాథ్ గారి వద్ద శిక్షణ పొంది.. ఆతరువాత ఆయన ఆధ్వర్యంలో సన్యాసినిగా మారారు. ఒకానొక ఇంటర్వ్యూలో... మమతా తాను మేకప్ కు 12 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నానని చెప్పారు.


వినోద్ ఖన్నా :

బాలీవుడ్ లో 1970-80ల్లో రాణించిన హీరోల్లో వినోద్ ఖన్నా ఒకరు. వినోద్ ఓషో శిష్యునిగా మారి ఆధ్యాత్మిక మార్గంలో నడిచారు. స్వామి వినోద భారతిగా పేరు గడించారు. వినోద్ ఖన్నాను సెక్సియస్ట్ స్వామిగా అప్పట్లో పిలిచేవారు. ఈయన ఆధ్యాత్మిక మార్గంలో నడవడంతో కుటుంబన్ని నిర్లక్ష్యం చేశారు. దాంతో మొదటి భార్య గీతాంజలి ఆయన నుంచి విడాకులు తీసుకుందని టాక్.

అను అగర్వాల్ :

ఢిల్లీ నుండి ముంబై చేరుకున్న ఈ డస్కీ బ్యూటీ అనతి కాలంలో ఇంటర్నేషనల్ మోడల్ గా ఎదిగింది.తన తొలి మూవీ ఆషికి చిత్రంతో స్టార్ అయిన ఈమె వాటన్నిటినీ వదిలేసి 1997 లో ఉత్తరాఖండ్ లోని యోగా ఆశ్రమంలో యోగినిగా చేరింది. తాను ఈ ఆశ్రమంలో చేరడం వల్లనే నిజమైన ఆనందం,సంతృప్తిని పొందుతున్నాని అలాగే తన జీవితం సంపూర్ణమైందనే భావన కలుగుతుందని ఆమె అన్నారు.సోఫియా హయత్ :

సోఫియా హయత్ 2014లో న్యూడ్ గా ఐస్ బకెట్ ఛాలెంజ్ చేసి కుర్రకారు దృష్టిని ఆకర్షించింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈమె ఉన్నట్లుండి సడన్ గా నన్ గా మారిపోయారు. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లడానికి కారణం కూడా చెప్పారు. తనకి దేవుని కృప వల్ల తన తొమ్మిది జన్మలు గురించి తెలిసిందని దాని కారణంగానే దైవ మార్గంలో నడవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపింది.Next Story

RELATED STORIES