Akhanda Movie : అఖండ మూవీకి ఈ ఐదుగురే హైలెట్

Akhanda Movie : అఖండ మూవీకి ఈ  ఐదుగురే హైలెట్
Akhanda Movie : బోయపాటి అంటేనే పక్కా మాస్ డైరెక్టర్.. ఫ్యాన్స్‌‌‌కి ఎక్కడ ఏం కావాలో ఆయనకీ బాగా తెలుసు.. అలాంటి మాస్ డైరెక్టర్‌‌కి బాలకృష్ణ లాంటి మాస్ హీరో దొరికితే ఇంకెలా ఉంటుంది.

Akhanda Movie : బోయపాటి అంటేనే పక్కా మాస్ డైరెక్టర్.. ఫ్యాన్స్‌‌‌కి ఎక్కడ ఏం కావాలో ఆయనకీ బాగా తెలుసు.. అలాంటి మాస్ డైరెక్టర్‌‌కి బాలకృష్ణ లాంటి మాస్ హీరో దొరికితే ఇంకెలా ఉంటుంది. ఎలా ఉంటుందో సింహ, లెజెండ్ సినిమాలు చూపించాయి. ఈ కాంబినేషన్ రిపీట్ అయితే ఇంకెలా ఉంటుందో ఈ రోజు రిలీజైన అఖండ చూపిస్తోంది. ఎక్కడ చూసిన ఈ సినిమాకి హిట్ టాకే.. ఎవరిని అడిగిన బ్లాక్ బస్టర్ మాటే.. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్‌‌‌గా ఐదుగురు నిలబడ్డారు ఇంతకీ ఆ ఐదుగురు ఎవరు?

బాలకృష్ణ :

ఎలాంటి పాత్రనైనా సరే అందులో పరకాయప్రవేశం చేసి ఆ పాత్రకి న్యాయం చేసే హీరో బాలకృష్ణ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కెరీర్ ముందు నుంచి కూడా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి బాలయ్య ఇష్టపడుతుంటారు. ఇప్పుడు అఖండలో అఘోర పాత్ర కూడా అంతే.. ఈ పాత్ర కోసం బాలయ్య బాగానే కష్టపడ్డారు. ఆయన వేషాధారణ సినిమాకే మెయిన్ హైలెట్ నిలిచింది. ఆహార్యం, డైలాగ్ డెలివరీ కూడా బాలయ్యకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.

బోయపాటి :

బాలయ్య అంటే బోయపాటికి ఎక్కడ లేని పూనకం వస్తుందేమో.. ఆయనకోసం ప్రత్యేకంగా ఓ స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేస్తారు బోయపాటి. అలా డిజైన్ చేసిన పాత్రలే సినిమాకి మెయిన్ హైలెట్‌‌‌గా నిలుస్తాయి. ఇప్పుడు అఖండలో అఘోర పాత్ర కూడా అదే. ఇదే సినిమాకి సోల్ .. సినిమాలో ఆ పాత్రను పర్ఫెక్ట్ గా స్క్రీన్ పైన ప్రజెంట్ చేసి సక్సెస్‌‌‌ని ఖాతాలో వేసుకున్నాడు బోయపాటి. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే, భావోద్వేగాలు కూడా అంతే బ‌లంగా పండేలా సినిమాని తీర్చిదిద్దారు బోయపాటి.

తమన్ :

తమన్ అంటే పాటలు కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా.. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్‌‌‌కి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత ఊపు తెస్తోంది. అఘోరా పాత్ర వచ్చినప్పుడు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తే ఆయ‌న ప‌డిన క‌ష్టం ఎలాంటిదో అర్థమ‌వుతుంది.

రామ్ ప్రసాద్ :

బోయపాటి సీన్స్ ని అర్ధం చేసుకొని వాటిని స్క్రీన్ పైన ప్రజెంట్ చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్.. చాలా రిచ్ లొకేషన్‌‌లో అత్యద్భుతంగా సీన్స్ ని కెమరాలో బంధించారు. ఒక్కో సీన్ కు వావ్ అనాల్సిందే.

మాటలు, ఫైట్స్ :

బాలయ్య, బోయపాటి అంటే టక్కున గుర్తోచ్చేవి డైలాగ్స్, ఫైట్స్ మాత్రమే.. అఖండలో కూడా అంతే ఎం.ర‌త్నం ఒక్కో మాట ప్యాన్స్ లో పూనకాన్ని తెప్పిస్తుంది. ఇక ఫైట్స్ అయితే ఇంకో లెవల్.. తగ్గదే.. లే..!

Tags

Read MoreRead Less
Next Story