బిగ్‌బాస్ నటి ఆత్మహత్య..

బిగ్‌బాస్ నటి ఆత్మహత్య..
ఆదివారం అర్థరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.

తీవ్ర ఒత్తిడి, జీవితంపై విరక్తితో బిగ్ బాస్ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ మాజీ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరులోని ప్రగతి లేఔట్ మగడి రోడ్‌లో ఉన్న వృద్ధాశ్రమంలో ఉరి వేసుకుని జయశ్రీ రామయ్య ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం (జనవరి 25) మధ్యాహ్నం జయశ్రీ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్థరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.

జయశ్రీ బలవన్మరణానికి పాల్పడడం కన్నడ సినీ పరిశ్రమను దిగ్భాంతికి గురి చేసింది. జయశ్రీ మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఒత్తిడి, నిరాశ, జీవితంపై విరక్తితో జయశ్రీ రామయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు గతంలో చాలా సార్లు వెల్లడించిన జయ ఇప్పుడిలా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గత ఏడాది జులై 22న జయశ్రీ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. నేను వెళ్లి పోతున్నా. ఈ ఫ...గ్ వరల్డ్, డిప్రెషన్‌కి గుడ్‌బై అని జయశ్రీ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ద్వారా నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. అయితే ఆ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేశారు. తాను బాగానే ఉన్నానని మరో పోస్ట్ పెట్టారు. అనంతరం జులై 25న సోషల్ మీడియా ద్వారా లైవ్‌లోకి వచ్చారు. తాను ఇదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదని అన్నారు.

కన్నడ హీరో కి్చ్చా సుదీప్ నుంచి తానెలాంటి సాయం ఆశించడం లేదని అన్నారు. ఆర్థికంగా తాను బలంగా ఉన్నానని.. కాకపోతే డిప్రెషన్‌తో బాధపడుతున్నానని తెలిపారు. తనకు వ్యక్తిగత సమస్యలు చాలా ఉన్నాయని వాటన్నింటినీ అధిగమించలేక పోతున్నానని బాధపడ్డారు. దయచేసి తనపై కామెంట్లు చేయడం ఆపాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story