సినిమా

BiggBoss Season 5: బిగ్ బాస్‌లో హైదరాబాద్ అమ్మాయి, అమెరికా అబ్బాయి..

బిగ్ బాస్.. ప్రపంచంలోనే ఇది బిగ్గెస్ట్ రియాలిటీ షో అనడంలో ఆశ్చర్యమే లేదు. ఇది అందిస్తున్న ఎంటర్టైన్మెంట్ అలాంటిది.

BiggBoss Season 5: బిగ్ బాస్‌లో హైదరాబాద్ అమ్మాయి, అమెరికా అబ్బాయి..
X

BiggBoss Season 5: బిగ్ బాస్.. ప్రపంచంలోనే ఇది బిగ్గెస్ట్ రియాలిటీ షో అనడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే ఈ షో అందిస్తున్న ఎంటర్టైన్మెంట్ అలాంటిది. అయితే ముందు సీజన్ల కంటే బిగ్ బాస్ 5లో అయిదు రెట్లు ఎక్కువ ఫన్ ఉండనుందని హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ లవర్స్ కు మాటిచ్చాడు. దానికి తగినట్టుగానే హౌస్ మేట్స్ కూడా ప్రేక్షకులకు వినోదాన్ని అందించే పనిలో పడ్డారు.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నవారంతా ఒకచోట కలిసి ఉండవలసి వస్తుంది కాబట్టి గొడవలు సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈవారం నామినేషన్స్ లో జరిగిన ఒక గొడవ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. నామినేషన్స్ లో ప్రియా.. లహరిని నామినేట్ చేస్తూ తాను ఎక్కువగా అబ్బాయిలతో సన్నిహితంగా ఉంటుందని, అంతే కాకుండా అర్థరాత్రి వాష్ రూమ్‌లో లహరి రవిని హగ్ చేసుకుందని చెప్పడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది.

నామినేషన్స్ జరిగి రెండు రోజులు గడిచిపోయినా కూడా దీని నుండి ఎవరూ బయటికి రాలేకపోతున్నారు. ప్రియా చూసింది చూసినట్టుగా అందరి ముందు బయటపెట్టినా కూడా తాను చెప్పిన విధానం వల్ల లహరి, రవిలపై చాలా నెగిటివిటీ ఏర్పడింది. రవి భార్య నిత్య సక్సేనా కూడా ఇన్స్‌స్టాగ్రామ్ లో దీని గురించి పోస్ట్ చేసింది. ఇలాంటి కష్టమైన పరిస్థితులు ఎన్నింటినో దాటి వారిద్దరు ఇంతకాలం కలిసున్నారని చెప్తూ రవిని ఇలాంటప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్న తన ఫ్యాన్స్ కు థాంక్యూ తెలిపింది.

ఇదిలా ఉండగా రవి మాత్రం లహరి యాంకరింగ్ ఛాన్స్ కోసమే తన వెంట తిరుగుతుందని కామెంట్ చేసిన విషయం ఇన్నాళ్లకు బయటికొచ్చింది. దీని గురించి వారిద్దరి మధ్య డిస్కషన్ కూడా జరిగింది. ఇక ఈ గొడవలను మర్చిపోయి అందరు కాసేపు సరదాగా గడిపేందుకు బిగ్ బాస్ వారికి హైదరాబాద్ అమ్మాయి, అమెరికా అబ్బాయి అనే టాస్క్ ఇచ్చాడు. దీంతో హౌస్ లో వాతావరణం కాస్త కూల్ అయ్యింది.

Next Story

RELATED STORIES