Gaddar : చిరు మూవీలో గద్దర్.. ఇంతకీ ఆయన రోల్ ఏంటి?

Gaddar :  చిరు మూవీలో గద్దర్.. ఇంతకీ ఆయన రోల్ ఏంటి?
Gaddar : ఆచార్య మూవీని ఫినిష్ చేసి ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌‌లో పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి.. అందులో ఒకటి గాడ్‌ఫాదర్..

Gaddar : ఆచార్య మూవీని ఫినిష్ చేసి ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌‌లో పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి.. అందులో ఒకటి గాడ్‌ఫాదర్.. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి రోల్ చాలా పవర్‌పుల్‌‌గా ఉంటుందని తెలుస్తోంది.

ఇందులో బాలవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌‌లో కూడా పాల్గోంటున్నాడు సల్మాన్.. అంతేగాక ఈ చిత్రంలో ప్రజాగాయకుడు గద్దర్ కూడా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో సినిమా పైన అంచానాలు పెరిగిపోయాయి.. అయితే ఇందులో గద్దర్ పాత్ర ఏంటీ అన్నది అసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వస్తోన్న కధనాల ప్రకారం గద్దర్ చిరంజీవి తండ్రికి స్నేహితుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ కథ ప్రకారం.. చిరంజీవి జైలుకు వెళ్తే.. అక్కడ తన తండ్రి స్నేహితుడైన గద్దర్‌ను ఆయన కలుసుకుంటాడట... ఈ నేపథ్యంలో చిరు తండ్రికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చిరంజీవితో పంచుకుంటాడట గద్దర్.. అయన పాత్ర సినిమాలో వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story