Gandivadhari Arjuna Pre - Release : ప్రీరిలీజ్ డేట్, ప్లేస్ పై క్లారిటీ..!

Gandivadhari Arjuna Pre - Release : ప్రీరిలీజ్ డేట్, ప్లేస్ పై క్లారిటీ..!
'గాండీవధారి అర్జున' ప్రీరిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటిస్తోన్న 'గాండీవధారి అర్జున' ప్రీరిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తోన్న అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఈవెంట్ ను ఆగస్టు 21న హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ హాల్ లో జరగనున్నట్టుగా ఫిక్స్ చేశారు. సాయంత్రం 6 గంటల సమయం నుంచి స్టార్ట్ కానుందని కూడా వెల్లడించారు. టాలీవుడ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామా ఇప్పటికే టీజర్, ఫస్ట్ లుక్ లతో మంచి ఆసక్తి రేకెత్తింది. అంతే కాదు ఈ మూవీ ట్రైలర్ తో కూడా మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న ఈ సమయంలో మేకర్స్ ఈ చిత్రం ప్రీ రిలీజ్ కి డేట్ అండ్ వేదికని ఇప్పుడు అనౌన్స్ చేశారు.

అయితే 'గాండీవధారి అర్జున' చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారు అనేది మాత్రం రివీల్ కావాల్సి ఉంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జీ ముకేశ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేశారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ చేశారు.

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో ఈ సినిమా నిర్మితమైంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల కానుండగా.. రీసెంట్ గా గాండీవధారి అర్జున సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్నట్టు మేకర్స్ వెల్లడించారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేసినట్టు తెలిపారు. ఇక 'ఏజెంట్' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన 'సాక్షి వైద్య' ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ఆమె గ్లామరస్ గా కనిపించడమే కాదు .. భారీ యాక్షన్ దృశ్యాలలో పాల్గొనడం విశేషం. ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలోని పాటలు కూడా ఇప్పుడు సందడి చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకు మరి థియేటర్లలో ఏ తరహా రెస్పాన్స్ ను అందుకుంటుందో వేచి చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story