Gangubai Kathiawadi: 'గంగూబాయి కతియావాడి' సినిమాను వదిలేసుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్లు..

Gangubai Kathiawadi: గంగూబాయి కతియావాడి సినిమాను వదిలేసుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్లు..
Gangubai Kathiawadi: గంగూబాయి కతియావాడి సినిమాలో ఆలియా పాత్రను ముందుగా దీపికా చేయాల్సి ఉందట.

Gangubai Kathiawadi: ఇప్పటికీ సినీ పరిశ్రమలో ప్రేక్షకులకు తెలిసినవారివి, తెలియనవారివి ఎన్నో బయోపిక్స్ తెరకెక్కాయి. కానీ అన్నింటిలో డిఫరెంట్ బయోపిక్.. 'గంగూబాయి కతియావాడి'. ఒక వేశ్య నుండి రెడ్ లైట్ ఏరియాకే డాన్‌గా మారిన ఓ మహిళ కథ ఇది. ఈ కథను బాలీవుడ్ వారకే కాదు మూవీ లవర్స్ అందరికీ చూపించాలనుకున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. అయితే ఇందులో హీరోయిన్‌గా ఆలియాకంటే ముందుగా ఇద్దరు స్టార్ హీరోయిన్లను సంప్రదించాడట దర్శకుడు.

గ్రాండ్‌గా, విజువల్ వండర్‌లాగా సినిమాలు తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీ స్పెషలిస్ట్. అయితే సంజయ్ సినిమాలలో ఎక్కువగా కనిపించిన నటీనటులే మళ్లీ మళ్లీ కనిపిస్తూ ఉంటారు. సంజయ్ ఇప్పటివరకు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనెలాంటి వారితోనే ఎక్కువగా సినిమాలు తెరకెక్కించడానికి ఇష్టపడతాడని ఎప్పటినుండో బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అందుకే ముందుగా గంగూబాయి కతియావాడి కథను కూడా వారి దగ్గరికే తీసుకెళ్లాడట భన్సాలీ.


గంగూబాయి కతియావాడి సినిమాలో ఆలియా పాత్రను ముందుగా దీపికా చేయాల్సి ఉందట. కానీ ఎందుకో దీపికా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. తర్వాత ఈ ఆఫర్ ప్రియాంక చోప్రా దగ్గరకు వెళ్లగా ప్రస్తుతం తాను సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది కాబట్టి తాను కూడా ఈ సినిమాను ఓకే చేయలేదట. ఫైనల్‌గా ఈ ఆఫర్ ఆలియా చేతికి వచ్చింది. అంతే కాకుండా గంగూబాయి పాత్రలో ఆలియా చాలా బాగా చేసిందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story